BigTV English

BB Telugu 9: మరో కొత్త సీజన్ కి సర్వం సిద్ధం.. అప్పటినుంచే..!

BB Telugu 9: మరో కొత్త సీజన్ కి సర్వం సిద్ధం.. అప్పటినుంచే..!

BB Telugu 9: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 105 రోజులపాటు నిర్విరామంగా ఆకట్టుకున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss). డిసెంబర్ 15వ తేదీన 8వ సీజన్ ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ సీజన్.. మధ్యలో 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఎట్టకేలకు నిఖిల్ , గౌతమ్ టైటిల్ కోసం పోటీ పడగా.. నిఖిల్(Nikhil )టైటిల్ విజేతగా నిలవగా గౌతమ్(Goutham) రన్నర్ గా నిలిచారు. ఇకపోతే ఈ సీజన్ పూర్తీ అవడంతో అభిమానులు కాస్త డీలా పడిపోయారు. మరో కొత్త సీజన్ రావాలి అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఎదురు చూడాల్సిందే అంటూ కామెంట్లు చేశారు. అయితే అభిమానుల ఫీలింగ్స్ అర్థం చేసుకున్న నిర్వహకులు, మరో కొత్త సీజన్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. మరి ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? దాని విశేషాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం..


త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం.

ఇకపోతే బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతోమంది ఆడియన్స్ కి ఫేవరెట్. అయితే ఈ షో ని ఎంతమంది అయితే అభిమానిస్తున్నారో.. అంతేమంది వ్యతిరేకిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే ప్రతి సీజన్లో ప్రతి ఎపిసోడ్ ను ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ 24 గంటల లైవ్ ను చాలా ఇంట్రెస్ట్ గా చూసే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే సీజన్ 8 విషయానికి వస్తే.. కన్నడ వ్యక్తికి టైటిల్ ఇవ్వడంతో కాస్త విమర్శలు వస్తున్నాయి..ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ను చాలా డిఫరెంట్ గా నడిపించింది. అనుకున్నట్టుగానే మంచి టిఆర్పి రేటింగ్ కూడా లభించింది. అంతేకాదు సీజన్ సీజన్ కి కాంట్రవర్సీలు కూడా పెరుగుతూ ఉండగా మరొకవైపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభమవుతుందని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు జనాలు వాటిపై ఆసక్తి చూపించకపోవడంతోనే బిగ్ బాస్ సీజన్ 9ను త్వరలోనే మొదలు పెట్టాలని అనుకుంటున్నారట నిర్వాహకులు.


సమ్మర్ హాలిడేస్ టార్గెట్..

ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటినుంచే మొదలుపెట్టినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ నెలలో మొదలై డిసెంబర్లో ముగుస్తుంది. అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ ను వచ్చే యేడాది మార్చిలోనే ప్రారంభించాలని చూస్తున్నారట. సమ్మర్ సెలవులు అయిపోయే వరకు బిగ్ బాస్ షో కూడా కొనసాగుతుంది అని సమాచారం. ముఖ్యంగా జనాలకు ఎక్కువగా రీచ్ అవ్వడం కోసమే ఈ సమ్మర్ హాలిడేస్ ను ఉపయోగించుకోబోతున్నారట నిర్వాహకులు. ప్రస్తుతం మార్చి నుండి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు.. అయితే ఇంకా దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సీజన్ 8 లో జరిగిన పొరపాటులను మళ్లీ సీజన్ 9 లో రిపీట్ కాకుండా జాగ్రత్త పడబోతున్నారట..ఇకపోతే కంటెస్టెంట్స్ గా ఎవరిని తీసుకోబోతున్నారు? ఎవరు రాబోతున్నారు? అనే విషయాలు మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రతి సీజన్ కి కూడా ఇప్పుడు భారీ పాపులారిటీ లభిస్తోంది అని చెప్పవచ్చు.

Related News

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Big Stories

×