E-Paper
Advertisement

ఏపీలో అన్నదాతలకు శుభవార్త.. శనివారం అకౌంట్‌లో రూ.7వేలు, ఖాతా ఒక్కసారి చెక్ చేసుకోండి

ఏపీలో అన్నదాతలకు శుభవార్త.. శనివారం అకౌంట్‌లో రూ.7వేలు, ఖాతా ఒక్కసారి చెక్ చేసుకోండి
Advertisement

Amaravati: రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ ఏడాది తొలి విడత కింద అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం సంబంధించిన నిధులను విడుదల చేయాలని డిసైడ్ అయ్యింది. జూన్ 20న అంటే శనివారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రూ.7 వేలు చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయనున్నారు.

ఏపీలో అన్నదాతలకు శుభవార్త

Advertisement

రైతులకు మరో శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం విడుదలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతోపాటు నిధులను కలిపి జూన్ 20న అంటే శనివారం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.

అర్హులైన రైతులకు రూ.7,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. వ్యవసాయ శాఖ నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. శనివారం పల్నాడు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తొలి విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరవుతున్నారు.

Advertisement

శనివారం అన్నదాతలకు నిధులు విడుదల, అకౌంట్‌లో ఏడేసి వేలు రూపాయలు

అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27 ఏడాదికి సంబంధించి తొలి విడతగా ఒక్కో రైతుకి రూ.7వేలు చొప్పున డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. రూ.7 వేలలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి రూ.5వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కలిసి వేయనుంది.

ఏపీ వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల అకౌంట్‌లలో రూ.3,125.47కోట్లు జమ చేయనుంది. అందులో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817మంది ఉన్నారు. అటవీ భూమి హక్కుదారులు 1,16,021 మంది ఉన్నారు. రైతులకు ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో రాష్ట్ర వాటా కింద రూ.2,342.92 కోట్లు ఉంది. అందులో కేంద్ర వాటా కింద రూ.782.5కోట్లు ఉన్నాయి.

ALSO READ: ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్-DBT విధానంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఈ విషయంలో రైతులు ఎలాంటి దరఖాస్తులు చేయనక్కర్లేదు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నిధులు పడతాయి. శనివారం ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో ఒక్కసారి బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్‌లో నమోదైన రైతులు, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా కలిగినవారు నేరుగా నిధులు జమ అవుతాయి. అంతేకాదు రైతులు e-KYC పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా అన్నదాతలు ఉండాలి. నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ నిబంధనలను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ కావాలి, అలాగే బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. ఇక భూముల రికార్డుల్లో రైతు పేరు తప్పనిసరి, పీఎం కిసాన్- e-KYC పూర్తి చేయాలి. దీనికి తోడు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి.

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×