E-Paper
Advertisement

దేశంలో పడిపోయిన బంగారం దిగుమతులు.. బంగారం కొనుగోలు రైట్ టైమ్, 40 శాతం పెరగడం ఖాయం?

దేశంలో పడిపోయిన బంగారం దిగుమతులు.. బంగారం కొనుగోలు రైట్ టైమ్, 40 శాతం పెరగడం ఖాయం?
Advertisement

Gold Price:  ఇరాన్ యుద్ధం క్లోజ్ కావడంతో మదుపరుల చూపు ఎటు? బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టారా? కేంద్రం సుంకం పెంపు తర్వాత బంగారం దిగుమతులు అమాంతంగా పడిపోయాయా? ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు 40 శాతం పెరిగే అవకాశముందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

సుంకం పెంపు తర్వాత అమాంతంగా తగ్గిన బంగారం దిగుమతులు

Advertisement

కేంద్రం సుంకం విధించడంతో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. నెలకు 70 నుంచి 30 టన్నుల వరకు తగ్గినట్టు ప్రభుత్వం తెలిపింది. విదేశీ మారక నిల్వలను రక్షించే చర్యల్లో భాగంగా పసిడిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది కేంద్రం.

గతంలో నెలకు 75 నుంచి 100 టన్నుల బంగారం దిగుమతి చేసుకునేవారు వ్యాపారులు. గడిచిన నెల రోజుల్లో దిగుమతులు అమాంతంగా 25 నుంచి 30 టన్నులకు పడిపోయింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026లో బంగారం దిగుమతులు సుమారు 5.63 బిలియన్ డాలర్లుగా ఉండేది.

Advertisement

బంగారం కొనుగోలు,పెట్టబడులకు రైట్ టైమ్, 40 శాతం పెరగడం ఖాయం?

సుంకాల పెంపు తర్వాత మే 2026 నాటికి 3.42 బిలియన్ డాలర్లకు పడిపోయింది. పెరిగిన బంగారం ధరల మధ్య ఆభరణాల డిమాండ్ బలహీనపడింది. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా బంగారం రీసైక్లింగ్ పెరిగిందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు రీసైకిల్ చేయని ఆభరణాలు ఇప్పుడు రీసైకిల్‌పై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాయి.

ఇరాన్ యుద్ధం మొదలు బంగారం-వెండి ధరలలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. ఈ నేపథ్యంలో మదుపరుల చూపు పుత్తడిపై ఫోకస్ చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణుల అంచనా.

బంగారం ధర 40 శాతం వరకు పెరగవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. ఈ అంచనా నిజమైతే భారత మార్కెట్లలో కొత్త రికార్డు నమోదు అవ్వడం ఖాయం. ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి బంగారం ధర ఔన్సుకు సగటున 6000 డాలర్లు, 2027 చివరి నాటికి ధర ఔన్సుకు సుమారు 6300 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 40 శాతం పెరిగే అవకాశం తేల్చేసింది.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజులో ఎన్నివేలు పెరిగిందంటే?

2026 మార్చి నుంచి ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఆ తర్వాత పరిణామాలు చమురు రవాణాకు అతిపెద్ద సవాలుగా మారింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి బంగారం ధరలు 20 శాతం మేరా పడిపోయాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలను పెంచింది.

ఫలితంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను దీర్ఘకాలంపాటు అధికంగా ఉంచగలదనే విశ్వాసం మార్కెట్‌లో బలపడింది. రానున్న రోజుల్లో మదుపరులు బంగారానికి మంచి మద్దతును అందించగలవని జేపీ మోర్గాన్ భావిస్తోంది. ద్రవ్యోల్బణం కొన్నాళ్లు అధికంగా ఉండవచ్చు. ఫలితంగా డాలర్ కొనుగోలు శక్తి బలహీనపడవచ్చని అంచనా వేసింది. అమెరికా విధానాల్లో అనిశ్చితితోడు ఆర్థిక సవాళ్లు కూడా పెరుగుతున్నాయి.

ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ చర్య.. బంగారం ధరల పెంపు మద్దతుగా నిలుస్తుందని భావిస్తోంది. ఈ అంచనా నిజమైతే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 2.13 లక్షలకు చేరినా ఆశ్చర్యపోన్కర్లేదు.

Related News

యూపీఐ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రూ.2,000 దాటితే ఛార్జీల మోత.. రానున్న మార్పులివే!

100 పర్సెంట్ ప్యూర్ అంటూ మోసం.. డాబర్ కంపెనీ తేనె, నెయ్యి సహా పలు ప్రొడక్ట్స్‌పై నిషేధం..

పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. మార్కెట్లో తులం ధర ఎంత? ఇంకెందుకు ఆలస్యం

ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

Big Stories

Advertisement
×