BigTV English

Metro In AP: విజయవాడ, విశాఖ మెట్రోకి కొత్త ప్రతిపాదనలు.. రూట్లు మారాయా? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

Metro In AP: విజయవాడ, విశాఖ మెట్రోకి కొత్త ప్రతిపాదనలు.. రూట్లు మారాయా? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

Metro In AP: ఏపీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కేంద్రం నుంచి పర్మీషన్లు తెచ్చుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. గడిచిన ఐదు నెలలు ఇదే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే అమరావతికి నిధులు రావడంతో రేపో మాపో నిర్మాణాలు మొదలు కానున్నాయి.


లేటెస్ట్‌గా విజయవాడ, విశాఖ మెట్రో వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. గ్రీన్‌సిగ్నల్ రాగానే పనులు మొదలుకానున్నాయి. వచ్చే నెల నుంచి అమరావతి పనులు మొదలుకానున్నాయి. జనవరి తర్వాత పోలవరం వర్క్స్ మొదలు పెట్టాలని చూస్తోంది.

విభజన చట్టం ప్రకారం విజయవాడ, విశాఖ మెట్రోలను తెరపైకి తెచ్చింది చంద్రబాబు సర్కార్. దీనికి సంబంధించి డీపీఆర్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పంపింది చంద్రబాబు సర్కార్. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టాలని భావిస్తోంది.


ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం విజయవాడ, విశాఖ మెట్రోకు దాదాపు 42 వేల కోట్ల రూపాయలు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విజయవాడ రెండు దశల్లో మూడు కారిడార్లు పనులు చేయనుంది. మొదటి దశలో కారిడార్-1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు నిర్మాణం చేపట్టనుంది. ఇక కారిడార్- 2 కింద నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు చేయాలని ఆలోచన చేస్తోంది. సెకండ్ ఫేజ్‌లో పండిత్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు.

విశాఖలో రెండు దశల్లో నాలుగు కారిడార్లు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. మొదటి దశలో కారిడార్-1 కింద స్టీల్‌ప్లాంట్ గేటు నుంచి కొమ్మాది కూడలి వరకు. ఇక కారిడార్- 2 కింద గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీసు ప్రతిపాదన. కారిడార్- 3 తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు తొలి దశలో నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లెక్క. సెకండ్ ఫేజ్‌లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది.

ALSO READ:  పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, న్యూయార్క్ ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి లోకేష్

పునర్విభజన ప్రకారం ఈ రెండు మెట్రోల నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాల్సివుంది. ఏపీకి ఉన్న ఆర్థిక పరిమితులు, నిధుల కొరత దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిధులు కేంద్రమే భరించాల్సి ఉంటుంది. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. గతంలో ఈ రెండు మెట్రోలపై అప్పటి టీడీపీ సర్కార్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని వైసీపీ అటకెక్కించింది.

ఇక్కడ చంద్రబాబు సర్కార్ పాత ఫార్ములాను తెరపైకి తెచ్చింది. 2017 పాలసీ ప్రకారం కోల్‌కతా మెట్రోకు ఇచ్చిన 100 శాతం నిధులు మాదిరిగానే ఇవ్వాలని సూచన చేసింది. దీనిపై కొద్దిరోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన మంత్రి నారాయణ, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

ప్రస్తుతం మెట్రోలకు అదే విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. మరి మోదీ సర్కార్ ఏ విధంగా ఆలోచన చేస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో పెట్టి నిధులు కేటాయిస్తుందా? లేక కేబినెట్‌లో తీర్మానం చేసి ఓకే చెబుతుందా? అనేది వెయిట్ అండ్ సీ.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×