BigTV English

Minister Lokesh in New York: పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, న్యూయార్క్ ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి లోకేష్

Minister Lokesh in New York:  పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, న్యూయార్క్ ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి లోకేష్

Minister Lokesh in New York: ఏపీలో పరిశ్రమలు పెడితే ప్రత్యేక ప్రోత్సాహ కాలు ఇస్తామని ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. న్యూయార్క్‌లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సుకు ఆయన హాజరయ్యారు. వివిధ పారిశ్రామిక‌వేత్తలతో వన్ టు వన్ భేటీ కావడం ఇందులో కొసమెరుపు.


ఏపీకి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అమెరికా వెళ్లారు మంత్రి నారా లోకేష్. ప్రపంచంలోని టాప్ -500 కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించి ఫ్యూచర్ ప్రణాళికను వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు.

కేవలం పరిశ్రమల వైపు కాకుండా, ఎడ్యుకేషన్ సెక్టార్‌లో మార్పులను వివరించే ప్రయత్నం చేశారు. కావాల్సినంత యువత ఏపీలో ఉందని, ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని వివరించారు. రాబోయే టెక్నాలజీ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న యూనివర్సిటీలను సైతం వివరించారు.


టూర్‌లో చివరిరోజు మంత్రి లోకేష్.. న్యూయార్క్‌లో జరిగిన పెట్టుబడిదారుల సమావేశానికి హాజరయ్యారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో మార్గ మధ్యలో కారు వదిలేసి కాలి నడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలిశారు మంత్రి.

ALSO READ: విజయమ్మపై జగన్ కుట్ర? ఆధారాలు బయటపెట్టిన టీడీపీ.. ఆ రోజు ఘటనపై ఎంక్వైరీ?

విట్ బై హోటల్‌లో జరిగిన సమావేశంలో ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ సిద్ధంగా ఉందన్నారు. భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ ఉందన్నారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా ఏపీ పరుగులు పెడుతోందన్నారు. ఈ సమావేశానికి టాప్ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. ముఖ్యంగా హెల్త్ సెక్టార్, కేపిటల్ వెంచర్స్, వివిధ కంపెనీల ఎండీలు హాజరయ్యారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×