E-Paper
Advertisement

Aadhaar Camps: విద్యార్థులకు అలర్ట్.. ఈ తేదీల్లో స్కూళ్లలో ఆధార్ క్యాంపులు, మిస్ కావద్దు

Aadhaar Camps: విద్యార్థులకు అలర్ట్.. ఈ తేదీల్లో స్కూళ్లలో ఆధార్ క్యాంపులు, మిస్ కావద్దు
Advertisement

Aadhaar Camps: చైల్డ్ ఆధార్ కార్డులు ఉన్న వారు 5, 15 సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 17 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలల్లో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరక్టర్ శివప్రసాద్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు.

ఇంకా 15.46 లక్షల బయోమెట్రిక్ పెండింగ్

రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారుమూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ జారీ సంస్థ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 15.46 లక్షల మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఇంకా అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల బయోమెట్రిక్‌ అప్డేట్‌ పూర్తిగా ఉచితమని, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

విద్యార్థులకు ఆధార్ కీలకం

Advertisement

ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, బ్యాంకులు ఇతర పనులకు ఆధార్ తప్పనిసరిగా అడుగుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆధార్ కార్డు తప్పనిసరి. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఆధార్‌ ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గతంలో ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రమే ఆధార్ నమోదు, అప్డేట్ చేసవారు ఇప్పుడు బ్యాంకులు, పోస్టాఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు తమ ఊరిలోనే ఆధార్ కార్డులను సులభంగా అప్డేట్ చేయించుకోవచ్చు.

ప్రవేశ, పోటీ పరీక్షలకు

నీట్‌ తో పాటు పలు పరీక్షలకు హాజరయ్యేవారు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌ అప్డేట్‌ తప్పనిసరి. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, ఇతర బయోమెట్రిక్‌ వివరాలు అప్డేట్ చేయించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 5 ఏళ్లు నిండిన వారికి తొలిసారి, 15 ఏళ్లు నిండిన విద్యార్థులు రెండోసారి అప్డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Also Read: Investment In Ap: ఏపీలో మరో పెద్ద పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ కంపెనీదే, మంత్రి లోకేష్ ప్రకటన

కొత్త ఛార్జీలు

అక్టోబర్ 1వ తేదీ నుంచి యూఐడీఏఐ ఆధార్‌ ఛార్జీలు పెంచింది. పేరు, పుట్టిన తేదీ వంటి డెమోగ్రఫిక్ వివరాలు మార్చుకోవడానికి గతంలో రూ.50 రుసుము ఉండగా ఇప్పుడు రూ.75లకు పెంచారు. డాక్యుమెంట్ అప్డేట్ కు రూ.50 నుంచి రూ.75 పెంచారు. బయోమెట్రిక్‌ అప్డేట్‌కు రూ.100 నుంచి రూ.125కు పెంచారు. ఆధార్ నమోదు, పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ మాత్రం ఉచితం.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×