E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: బీబీ రాజ్యంలో తిరుగుబాటు… ఇమ్మాన్యుయేల్, భరణిల నిరసన

Bigg Boss 9 Promo: బీబీ రాజ్యంలో తిరుగుబాటు… ఇమ్మాన్యుయేల్, భరణిల నిరసన
Advertisement

Bigg Boss 9 Day 67 Promo 2: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 67వ రోజుకు చేరుకుంది. మొన్నటి వరకు ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ మళ్లీ స్లో అయ్యింది. పెద్దగా ఆసక్తి అనిపించే అంశాలేవి కనిపించడం లేదు. పైగా కంటెస్టెంట్స్ ఆట కూడా చాలా పేలవంగా ఉంది. ఈ క్రమంలో షోని కాస్తా ఆసక్తిగా మలిచేందుకు బిగ్ బాస్ ని బీబీ రాజ్యంగా మార్చాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ కోసం బీబీ రాజ్యం పేరుతో కొత్త టాస్క్ ఇచ్చాడు.

దివ్యని ఓడించి కింగైన నిఖిల్

Advertisement

ఈ బిబి రాజ్యానికి కళ్యాణ్, దివ్య, రీతూలు కింగ్ క్వీన్ లుగా ఉండగా.. వారి కమాండర్స్ గా తనూజ, నిఖిల్, డిమోన్, సంజనలను పెట్టాడు. మిగిలిన వారు రాజ్య ప్రజలు. నిన్నటి టాస్క్ లో కమాండర్ నిఖిల్ దివ్యతో పోటీ పడి కింగ్ అయ్యాడు. దీంతో దివ్య కమాండర్ అయ్యింది. ఈ రోజు కి బిబి రాజ్యం టాస్క్ కొనసాగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించి బిగ్ బాస్ టీం వరుసగా ప్రొమోలు రిలీజ్ చేస్తోంది. ఇప్పటి విడుదలైన మొదటి ప్రోమోలో వాహ్ చెప్ సంజయ్ తుమ్మ హౌజ్ లోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.

Also Read: SS Rajamouli: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ, ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్: రాజమౌళి

Advertisement

చెఫ్ సంజయ్ ఎంట్రీ

కింగ్స్, క్వీన్ లకు తనదైన ప్రత్యేకమైన వంటకాలను మెప్పించారు. చెఫ్ సంజయ్ రాకతో హౌజంత సందడి వాతావరణం నెలకొంది. అయితే తాజాగా సెకండ్ ప్రొమో విడుదల చేశారు. ఇందులో బిబి ప్రజలు రాజులపై తిరుగుబాటు చేసినట్టు చూపించారు. ప్రజల నాయకులైన ఇమ్మాన్యుయేల్, భరణిలు రాజులు, రాణిల తీరుపై నిరసన తెలిపారు. తమకు ప్రజలను తొక్కేస్తున్నారని, న్యాయం కావాలి అంటూ ఇమ్మాన్యుయేల్, భరణిలు నినాదాలు చేశారు. చేతిలో గొడ్డళ్లు, కత్తులు పట్టుకుని తిరుగుబాటు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తారు.

భరణి, ఇమ్మాన్యుయేల్ తిరుగుబాటు

ఇదంత కూడా చాలా ఫన్నీగా జరిగింది. తమని టాస్క్ లు ఆడనివ్వడం లేదని, తమకు శిక్షలు తప్ప.. టాస్క్ లు ఆడనిస్తున్నారా? రాజ్యంలో అందరిని సమానంగా చూడాలని, లేదంటూ వలసలు పోతామంటూ నిరసన తెలిపారు. ఇదంత కూడా చాలా సరదగా, ఫన్నీగా సాగింది. ఈ ప్రొమో చూస్తుంటే ఈ రోజు ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఉంది. ఓ వైపు చెప్ సంజయ్ రాక, మరోవైపు ఇమ్మాన్యుయేల్ తన కమెడితో హౌజ్ మేట్స్ నే కాదు ఆడియన్స్ ని కూడా కడుపుబ్బా నవ్వించబోతున్నాడు.

ఈ ప్రొమోతో ఎపిసోడ్ పౌ ఆసక్తి నెలకొంది. నిన్నటి ఎపిసొడ్ లో తనూజ ఉమెన్ కార్డు వాడి డిమోన్ పై నిప్పులు చెరిగింది. తనపై చేతులు వేసి తోశాడని, అది బాధకలిగించిందంటూ డిమోన్ తో గొడవ పడింది. హౌజ్ కాసేపు తనూజ ఉమెన్ కార్డు వాడి పెద్ద డ్రామా చేసింది. ఈ విషయంలో డిమోన్ తన తప్పు ఉందని, మరోసారి అది రిపీట్ చేయనని చెప్పిన తనూజ వదలలేదు..డిమోన్ తో వాదన చేస్తూనే ఉంది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×