Shreyas Iyer on Vaibhav Sooryavanshi: ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. రెండు రోజుల కిందట ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… బలమైన ఇంగ్లాండ్ తో ఐదు టి20 సిరీస్ ఇవాల్టి నుంచి ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) కెప్టెన్సీ లోని టీమిండియా ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధం కానుంది. ఇలాంటి క్రమంలో ఇంగ్లాండ్ తో ( England vs India) జరిగే టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ అరంగేట్రంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Vaibhav Sooryavanshi) చాలా అహంకారంగా వ్యవహరిస్తూ మాట్లాడారు. వైభవ్.. వైభవ్ అంటూ జపం చేయడం ఆపండి… అంటూ ఓ జర్నలిస్టుపై శ్రేయస్ అయ్యర్ సీరియస్ కూడా అయ్యారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ అలాగే శ్రేయస్ అయ్యర్ మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాల్టి నుంచి 5 టీ20 ల సిరీస్ ( India tour of England, 2026) ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెస్ మీట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే, వైభవ్ సూర్య వంశీ ఆరంగేట్రం గురించి స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్ ప్రశ్నలు అందించారు. అసలు వైభవ్ సూర్యవంశీని తీసుకోకపోతే… కెప్టెన్, కోచ్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని జర్నలిస్టు విమల్ కుమార్ (Vimal Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరు ఏం ఆలోచించారా ? అంటూ శ్రేయస్ అయ్యర్ ను ప్రశ్నించారు. వైభవ్ గురించి వస్తున్న వార్తల గురించి పట్టించుకోరా ? అని నిలదీశారు అయితే ఈ ప్రశ్నలు విన్న శ్రేయస్ అయ్యర్.. సరదాగా సమాధానాలు చెప్పకుండా కాస్త అహంకారపూరితంగా వ్యవహరించారు.
ముందు వైభవ్ సూర్యవంశీ జపం ఆపండి అంటూ ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య అతిపెద్ద సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో… ఆ 15 ఏళ్ల బుడ్డోడి గురించి అందరూ ఎగబడి ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. అందరికీ అవకాశం వస్తుందని.. వైభవ్ సూర్యవంశంకి కూడా ఏదో ఒక రోజు ఆడే ఛాన్స్ రావడం గ్యారెంటీ అన్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అద్భుతంగా రాణించిన వాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తు చేశారు.
కొత్తగా వచ్చిన ప్లేయర్లకు అవకాశాలు రావడం కష్టమేనని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఈ విషయం తెలియకుండా ప్రతిసారి వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్నించడం సమంజసం కాదని కాస్త పొగరుగా శ్రేయస్ అయ్యర్ ఆన్సర్ ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తాయి.. వాటన్నిటిని చూసే తీరిక తనకు లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. తాను ఏ వార్తలు ఫాలో కాబోనని, సోషల్ మీడియా కూడా చూడబోనని తెలిపారు. కేవలం ఇంగ్లాండ్ పైన గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
The problem isnt what Shreyas Iyer said about #VaibhavSooryavanshi.
Its the arrogance in telling a journalist, "I don't follow your news"
These same journalists have been instrumental in vouching for Iyer's leadership credentials @Vimalwa @ashwinravi99 pic.twitter.com/f79kY9mBYI
— Abhinav Rajput (@Abhinavrt) June 30, 2026