Teen Care: టీనేజ్… పిల్లల లైఫ్ లోనే కాదు పేరెంట్స్ లైఫ్ లోను చాలా ఇంపార్టెంట్ ఫేజ్. సరిగ్గా చెప్పాలంటే మనిషి ఆలోచన విధానం, అలవాట్లు, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ని డిసైడ్ చేసే ఒక టర్నింగ్ పాయింట్.నిన్నటి వరకు చిన్ని చిన్ని అడుగులతో మన వెనుక తిరిగిన పాపాయి ఒక్కసారిగా టీనేజ్లోకి అడుగుపెడుతుందంటే తల్లిదండ్రుల్లో ఎన్నో తెలియని భయాలు మొదలైపోతాయి నిజంగా ఇలాంటి సమయంలోనే వాళ్లకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో అవసరం.
అయితే చాలామంది పేరెంట్స్ వారిలో వచ్చే ఆ చేంజెస్ సరిగ్గా అర్థం చేసుకోకుండా చిన్న చిన్న తప్పులకే సీరియస్ అయిపోతుంటారు .అనవసరమైన విమర్శలు చేయడం, ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండటం వంటి వాటి వల్ల పిల్లలు ఎమోషనల్ గా ఫ్యామిలీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువ .అందుకే వాళ్ళసెల్ప్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా ఫ్రెండ్లీగా పిల్లలకు విషయాలను వివరించడం తల్లిదండ్రుల కనీస బాధ్యత.
ముఖ్యంగా అమ్మాయిల వయసు పెరుగుతున్న కొద్దీ బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ అనే కొత్త ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది .అసలు పీరియడ్స్ అంటే ఏంటి ఆ సమయంలో వాళ్ళు ఎలా ఉండాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది పీరియడ్స్ మొదలవకముందే సున్నితంగా అర్థమయ్యేలా చెప్పడం మంచిది.అప్పుడే వాళ్లలో ఉండే అనవసరమైన భయాలు సందేహాలు తొలగిపోతాయి .
దీంతో పాటే శుభ్రంగా ఉండటం గురించి సరైన అవగాహన కల్పించాలి.రోజు స్నానం చేయడం దుస్తులు మార్చుకోవటం వంటి అలవాట్లు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయని అర్థమయ్యేలా చెప్పాలి. ఇక ఇదే ఏజ్ లో అమ్మాయిలని వేధించే మరో సమస్య మొటిమలు.బాడీలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఇవి వస్తాయని అంతేతప్ప ఇది అందానికి అడ్డంకి కాదని అర్థమయ్యేలా చెప్పాలి.ఇక పెరిగే ఏజ్ లో బాడీకి కావాల్సినంత ఎనర్జీ న్యూట్రిషన్ వంటివి చాలా ముఖ్యం.ఎంతో బిజీగా ఉన్నా పిల్లల డైట్ లో హై ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ ఉండేలా చూసుకుంటే మంచిది .
ALSO READ:సత్యదేవ్ ఖాతాలో మరో మాస్టర్ పీస్? ఉత్కంఠ రేపుతోన్న ‘రావు బహదూర్’ ట్రైలర్..
నో ఫ్యాట్ లో కార్బోహైడ్స్ వంటి ఫుడ్స్ ఇస్తే ఫ్యూచర్లో ఒబిసిటీ బారిన పడకుండా చూసుకోవచ్చు.కాలేజీలో చదువుల్లా ఒత్తిడిలో పడిపోయి చాలామంది నీళ్లు తాగడం మర్చిపోతుంటారు అందుకే రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా అమ్మాయిలని సిద్ధం చేయాలి.ముఖ్యంగా టీలు కాఫీలు డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంచడం మంచిది .
ఇక ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ పీస్ కూడా చాలా ముఖ్యం.ఇక టీనేజ్ అమ్మాయిల్లో చదువులు కాంపిటీషన్ తో పాటు ఇటు బాడీలో వచ్చె చేంజెస్ విపరీతమైన స్ట్రెస్ ని తీసుకొస్తాయి.అందుకే రోజుల్లో కనీసం ఒక గంట అయినా వాళ్లకు నచ్చిన పని చేసుకునేలా ఎంకరేజ్ చేయాలి.డ్రాయింగ్స్ పెయింటింగ్ లేదా ఏదైనా క్రియేటివ్ క్రాఫ్ట్ వైపు వాళ్లను ప్రోత్సహిస్తే మెంటల్ బ్యాలెన్స్ బాగుంటుంది.
వీటితోపాటు పెరిగే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా చాలా అవసరం,ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో వారికి అర్థమయ్యేంతవరకు వివరించడం వల్ల చైల్డ్ అబ్యూజ్ నుండి కాపాడొచ్చు. ఇక సాధారణంగా టీనేజ్ లో ఉండే అమ్మాయిలు సిగ్గు, భయాలతో ఆటలకి జిమ్ లకి దూరంగా ఉంటారు కానీ ఈ వయసులో ఫిసికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం అది గనుక లేకపోతే భవిష్యత్తులో థైరాయిడ్ ,PCODవంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.అందుకే వాళ్లను స్విమ్మింగ్ ,బాస్కెట్బాల్ ,వాకింగ్ లాంటి స్పోర్ట్స్ లో పాల్గొనేలా చేస్తే మంచిది.
చివరగా ఒక ముక్క లో చెప్పాలంటే టీనేజ్ అనేది వయసు మాత్రమే కాదు రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఒక అద్భుతమైన ఫౌండేషన్