AP Heavy Rains: ఏపీకి మరో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా బుధవారం రాత్రి, గురువారం వాయుగుండం గా మారే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వాయుగుండం క్రమంగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని, దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం, శ్రీ సత్యసాయి వైయస్సార్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని రైతులకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
వర్షాలు కురిసే సమయంలో రైతులు వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ సూచించింది. అలాగే పిడుగులు పడే సమయంలో భారీ చెట్ల కింద ఉండడంతో ప్రమాదం పొంచి ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని వారు కోరారు.