Mohan Babu Net Worth:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం మంచు కుటుంబంలో విభేదాలు. ముఖ్యంగా ఆయన ఇద్దరు కొడుకుల మధ్య వివాదం ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. ముఖ్యంగా ఆస్తుల కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు(Mohan Babu)ఆస్తి ఎంత ఉంది..? ఆయన ఎలా సంపాదించారు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.ఈరోజు ఉదయం మంచు విష్ణు(Manchu Vishnu)ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా.. కేవలం రెండు చొక్కాలతోనే ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు ,ఇబ్బందులు ఎదుర్కొని, నేడు కోట్లాది రూపాయలకు అధిపతి అయ్యారు మోహన్ బాబు. భక్తవత్సలం నాయుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మోహన్ బాబు, స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని, తన పేరును మోహన్ బాబు గా మార్చుకున్నారు. విలక్షణ నటుడిగా, గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెబుతూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు.. 50 ఏళ్ల సినీ కెరియర్లో దాదాపు 500 కు పైగా చిత్రాలలో నటించారు. అలాగే నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను రూపొందించారు.
నటుడి గానే కాదు నిర్మాతగా కూడా గుర్తింపు..
ఒకవైపు నటుడిగా, నిర్మాతగా కొనసాగుతూనే కొంతకాలం రాజకీయాలలో కూడా పనిచేశారు . ఎంపీగా చేసిన ఈయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా నటుడి గానే ఉండడానికి ఇష్టపడ్డారు. అందులో భాగంగానే సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పెద్ద మనుషులలో ఒకరిగా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు నటుడుగా సంపాదించిన డబ్బును నిర్మాతగా ఇంకొంచెం కూడబెట్టుకుని, ఆ డబ్బులను తెలివిగా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా తిరుపతిలో 1992లోని శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించిన మోహన్ బాబు, అది కాస్త ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరిపోయింది. అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు సాధారణ ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, కాలేజీలతో పాటు మెడికల్ రంగానికి చెందిన ఫార్మా నర్సింగ్ కాలేజ్ లు కూడా ఈ ట్రస్ట్ పరిధిలోనే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మెరిట్ బాగుండి మారుమూల ప్రాంతాలకు చెందిన పిల్లలు.. ఆర్థికంగా వెనుకబడితే .. వారికి ఈ విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందజేస్తున్నారు మోహన్ బాబు
మోహన్ బాబు విద్యాసంస్థలతో భారీ ఆదాయం..
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సమీపంలోనే ఎస్వీఈటి విద్యాసంస్థల్ని కూడా నడిపిస్తున్నారు. ఈ కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యాసంస్థలే ప్రధానమైనవి అని చెప్పవచ్చు. వందలాది ఎకరాలలో కొనసాగుతున్న ఈ విద్యాసంస్థలలో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ముఖ్యంగా 53 శాతం మంది అమ్మాయిలే ఈ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు మోహన్ బాబుకు హైదరాబాదులో ఇళ్లు, రంగారెడ్డి జిల్లా జల్ పల్లి లో ఫామ్ హౌస్ కూడా ఉంది. అలాగే ఫిలిం నగర్ లో ఒక ఇల్లు, హైదరాబాదులో పలు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అంతేకాదు తన సొంత ఊరిలో ఉన్న ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే ఉంచారు. అలాగే సొంత ఊర్లో కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది. సినీ నటుడిగా అవతారం ఎత్తిన ఈయన, ఆ తర్వాత నిర్మాతగా మారి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థలను స్థాపించారు. వీటి ద్వారా అనేక సినిమాలను ప్రొడ్యూస్ చేసి భారీగా సంపాదించారు.
మొత్తం ఆస్తి విలువ రూ.600 కోట్ల పైమాటే.
సినిమాల్లోనే కాకుండా మరికొన్ని సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మోహన్ బాబు వద్ద ఉన్న కారు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆడి Q7, రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు అంతేకాదు కుటుంబ సభ్యులకు ఉపయోగించడానికి మరికొన్ని సాధారణ కార్లు కూడా వున్నాయి. ఇక మొత్తంగా ఆస్తుల విలువ సుమారుగా రూ.600 కోట్ల పైమాటే అని సమాచారం.