Indian Railway Rule: రైల్వే నిబంధనలు తెలుసుకోకుంటే చిక్కులు తప్పవు. రైళ్లలో ప్రయాణించే వారు తప్పక కొన్ని రూల్స్ పాటించాల్సిందే. లేకుంటే రైల్వే అధికారులు తీసుకొనే చర్యలకు భాద్యులవుతారు. అందుకే రైల్వే రూల్స్ పై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రూల్ పై చాలా వరకు అవగాహన ఉండకపోవచ్చు. ఇంతకు ఆ రూల్ ఏమిటి? పాటించకుంటే ఎటువంటి శిక్షలు వర్తిస్తాయో తెలుసుకుందాం.
ఓ ప్రయాణికుడు రైలులో ప్రయాణిస్తున్నాడు. బయలుదేరిన రైలు ఆగింది. ఆగిన రైలు నుండి ఆ ప్రయాణికుడు దిగాడు. దిగిన వెంటనే పక్కన గల పట్టాలపై వేచి ఉన్నాడు. రైలు కూత కూసిన సమయంలో రైలెక్కాలన్నది తన అభిప్రాయం. రైలు కూత మోగింది.. రైలు కదిలింది.. ఆ ప్రయాణికుడు మాత్రం రైలు ఎక్కలేదు. కారణం రైల్వే అధికారులు అతడిని పట్టుకోవడమే. పక్కన గల పట్టాలపై ఆ ప్రయాణికుడు నిలబడితే, వారు పట్టుకోవడం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సేఫ్టీని దృష్టిని ఉంచుకొని రైల్వే శాఖ ఎన్నో చర్యలు చేపడుతోంది. అలాగే ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది, అందులో భాగమే ఈ రూల్. రైలు దారి మధ్యలో ఆగిన సమయంలో సాధారణంగా రైల్వే ప్రయాణికులు దిగడం సర్వ సాధారణం. అయితే తమ రైలు కదిలే వరకు పక్కనే గల పట్టాలపై కూడా కూర్చుంటారు. లేకుంటే నిలబడతారు.. ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆ పట్టాలపై రైలు వచ్చిందా.. పెను ప్రమాదం తప్పదు. ప్రాణాలైనా పోతాయి.. లేకుంటే తీవ్ర గాయాల పాలు కావాల్సిందే.
అందుకే ఇటువంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా రైల్వే సీరియస్ రూల్ అమలు చేస్తోంది. ప్రయాణీకుల భద్రత కోసం తీసుకున్న ఈ నియమ నిబంధనలను ప్రయాణికులు తప్పక పాటించాలని రైల్వే శాఖ కోరుతోంది. స్టేషన్ల వద్ద కాకుండా, మార్గమధ్యంలో రైలు ఏదైనా కారణం చేత ఆగినా, ప్రయాణికులు పక్కనే గల రైలు పట్టాలపైకి వెళ్లరాదు. అలా వెళ్ళి నిలబడినా, కూర్చున్నా రైల్వే శిక్షాస్మృతి సెక్షన్ 147 ప్రకారం మీరు శిక్షార్హులే.
Also Read: Google Office in Vishakaptanam: లోకేష్ వల్లే ఇదంతా.. సీఎం చంద్రబాబు కామెంట్స్ వైరల్
అలా ప్రవర్తించి పట్టుబడిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా రెండు శిక్షలు కూడా వర్తిస్తాయి. అందుకే ఎక్కడైనా మార్గమధ్యలో రైలు ఆగితే, పక్కనే గల పట్టాల పైకి వెళ్లొద్దు సుమా.. వెళ్లారంటే ప్రమాదం పొంచి ఉంటుంది.. అలా లేకుంటే రైల్వే చట్టం ప్రకారం శిక్షింపబడతారు.. తస్మాత్ జాగ్రత్త!