BigTV English
Advertisement

High court dismissed the petitions: ఆ ఇద్దరు వైసీపీ అభ్యర్థులకు భారీ షాక్.. !

High court dismissed the petitions: ఆ ఇద్దరు వైసీపీ అభ్యర్థులకు భారీ షాక్.. !

High court dismissed the petitions(AP latest news): ఏపీ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసినటువంటి పిటిషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం డిస్మిస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ రోజున హింసాత్మక సంఘటనల నేపథ్యంలో సత్తెనపల్లిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరుతూ మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కూడా డిస్మిస్ చేసినట్లు తెలుస్తోంది.


కాగా, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఓకేసారి జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోలింగ్ రోజు, ఆ తరువాత ఏపీలో పలుచోట్లా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మాచర్ల, తిరుపతి, తాడపత్రితోపాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి ఈ హింసాత్మక సంఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్, డీజీపీ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై ఏపీలో నెలకొన్న హింసాత్మక సంఘటనలపై వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఎన్నికల సంఘం ఏపీలోని పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానంలో ఇతర అధికారులను నియమించిన విషయం తెలిసిందే.

ఆ తరువాత సిట్ ఏర్పాటు చేసి విచారణ చేసి ఓ నివేదికను తయారు చేసి తమకు పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఆ సిట్ బృందం ఏపీలో హింసాత్మక సంఘటనలు ఎక్కడైతే చోటు చేసుకున్నాయో అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేసింది.


Also Read: ఏపీలో భారీ వర్షాలు.. ఎప్పట్నుంచంటే..?

అనంతరం హింసాత్మక సంఘటనలకు సంబంధించి ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీకి సిట్ అందించిన విషయం తెలిసిందే. అందులో పలు అంశాలను పేర్కొన్నది. హింసాత్మక సంఘటనలకు సంబంధించి కారణాలు, కారకులు.. ఇలా సిట్ పరిశీలించిన అంశాలను ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అదేవిధంగా ఫలితాలు రోజు జూన్ 4న తీసుకోవాల్సిన ముందస్తు శాంతిభద్రత పరమైన చర్యలకు సంబంధించి కూడా పలు అంశాలను అందులో సూచించినట్లు తెలిసిందే.

Related News

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Big Stories

×