BigTV English

Vishwak Sen Movie Promotion: ఎన్టీఆర్ ప్లాప్ సినిమా రీమేక్ చేస్తా.. హీరోయిన్స్ ఎవరంటే..?

Vishwak Sen Movie Promotion: ఎన్టీఆర్ ప్లాప్ సినిమా రీమేక్ చేస్తా.. హీరోయిన్స్ ఎవరంటే..?

Vishwak Sen’s Gangs of Godavari Movie Promotion: మాస్ కాగా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి నటించగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి నుంచి వాయిదాల మీద నడుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు చివరికి మే 31 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన విశ్వక్.. తన టీమ్ తో కలిసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. స్టార్ హీరో సినిమా అంటే సుమ లేని ప్రమోషన్స్ అస్సలు ప్రమోషనే కాదు.

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ తో సుమ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఎంతో సరదాగా సాగింది. సుమ పంచ్ లు, విశ్వక్, అంజలి అల్లరి బాగా సందడిగా సాగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో విశ్వక్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. విశ్వక్ కు ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తంలో ఎన్టీఆరే స్టార్ అనేంతగా చెప్పేస్తాడు.


Also Read: Sudigali Sudheer New Show: ఫ్యామిలీ స్టార్స్ తో వస్తున్న ఫ్యామిలీ స్టార్.. అదిరిపోయిన ప్రోమో

ఒక వీరాభిమానిగా ఎప్పుడు ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలబడతాడు. ఇక తారక్ కూడా విశ్వక్ విషయంలో అలానే ఉంటాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూలో.. ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేయాలనుకుంటావ్ అని సుమ అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా విశ్వక్ నా అల్లుడు అని చెప్పాడు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ సినిమాను రీమేక్ చేయాలనీ ఉందని తెలిపాడు. అంతేకాకుండా తన సజిషన్ అయితే శ్రీయ, జెనీలియా ప్లేస్ లో జాన్వీ కపూర్, మీనాక్షీ చౌదరి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకొచ్చాడు.

సాధారణంగా ఎవరైనా హిట్ సినిమాలను రీమేక్ చేయాలనుకుంటారు కానీ, నువ్వు ఏంటీ ప్లాప్ సినిమా రీమేక్ అంటావని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2015 లో ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు సినిమాకు వర ముళ్ళపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో అత్తగా రమ్యకృష్ణ నటించి మెప్పింది. మరి విశ్వక్ హీరోగా ఈ సినిమా రీమేక్ చేస్తే అత్తగా ఎవరిని పెడతాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×