US BirthRight Citizenship| అగ్రరాజ్యం అమెరికా భూభాగంపై జన్మించే పిల్లలందరికీ ఆ దేశ పౌరసత్వం ఇవ్వడం హాస్యాస్పదమైని.. ఈ విధానాన్ని తాను జనవరి 20న అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత రద్దు చేస్తానని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా రాజ్యాంగంలో గత 150 ఏళ్లుగా పౌరసత్వం గురించి ఉన్న ఈ నియమాన్ని ట్రంప్ చేస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పారు.
అమెరికా పౌరులకే కాకుండా ఆ దేశ భూభాగంపై జన్మించే పిల్లలందరికీ అమెరికా పౌరసత్వం పుట్టుకతోనే లభిస్తుంది. వారి తల్లిదండ్రులు ఇతర దేశాలకు చెందిన వారైనా పిల్లలకు మాత్రం ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అయితే ఈ నియమాన్ని ట్రంప్ రద్దు చేస్తనని చెబుతుండడంతో అక్కడ నివసిస్తున్న ఇండియన్ అమెరికన్స్‌కు ఇది ఆందోళన కలిగించే విషయం.
ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. “మేము పుట్టుకతో పౌరసత్వం నియమాన్ని మార్చేయబోతున్నం. దీని కోసం కావాలంటే ప్రజలనుంచి మద్దుతు కూడా కూడగడతాం. ఎలాగైనా సరే దీన్ని అంతం చేస్తాం.” అని అన్నారు. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు.. కానీ దీనిపై సీరియస్ గా చర్యలు చేపట్టలేదు.
అమెరికా పౌరసత్వ చట్టాల గురించి ఆ దేశ లాయర్ రస్సెల్ ఎ స్టామెట్స్ మాట్లాడుతూ.. “పౌరసత్వం గురించి ఇలాంటి వెసలుబాటు ఇతర దేశాలలో లేదు. అందుకే ట్రంప్, ఆయన అనుచరులు రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతోందని వాదిస్తున్నారు. అమెరికా పౌరసత్వం కఠినతరం చేయడానికి చర్యటు చేపట్టాలి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆ దేశ ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఆ చట్టంలో మార్పులు చేసేందుకు ట్రంప్ ముందడుగు వేస్తే.. ఆయనకు న్యాయపరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అమెరికాలో పౌరసత్వం కోసం చాలా మంది మహిళలు అక్రమంగా దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రసవిస్తారు. ఇది కేవలం పౌరసత్వం పొందడానికి చేస్తారని ట్రంప్ తో పాటు ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు అభిప్రాయపడుతున్నారు.
Also Read: 3 నెలల్లో 35 లక్షలు సంపాదించిన పెళ్లికూతరు.. ఏజెన్సీతో కలిసి మోసం చేయడమే పని
“సింపుల్ గా బార్డర్ క్రాస్ చేసేసి బిడ్డను ప్రసవించినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వకూడదు.” అని నెంబర్ యుఎస్ఎ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎరిక్ రుయార్క్ చెప్పారు. ఆయన అమెరికాకు వలసవచ్చే వారికి వ్యతిరేకంం.
ఎన్నికల ప్రచారంలో పలుమార్లు అక్రమ వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపేస్తామని చెప్పిన ట్రంప్.. “అమెరికా పౌరసత్వ చట్టం వల్ల ఇక్కడ పుట్టిన పిల్లలను వదిలేసి వారి తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోవాలి. కానీ అలా చేస్తే.. పిల్లలకు వారి తల్లిదండ్రులను దూరం చేసినట్లు అవుతుంది. అందుకే వారికి జన్మించిన పిల్లలను వారితోనే పంపిచేస్తాం.” అని అన్నారు.
పుట్టుకతో పౌరసత్వ చట్టంలో మార్పులు చేస్తే.. అమెరికాలో నివసించే వలసదారులందరూ ఏదో విధంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇండియాన్ అమెరికన్స్ ఈ కొత్త చట్టం వల్ల ఇబ్బందులు పడతారు. అమెరికాలో ప్రస్తుతం 48 లక్షల మంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. వీరిలో 34 శాతం అంటే 16 లక్షల మంది ఆ దేశంలోనే జన్మించినవారు. వీరందరూ ప్రస్తుత చట్ట ప్రకారం.. అమెరికా పౌరులే. ఒకవేళ ట్రంప్ ఈ చట్టంలో మార్పులు చేస్తే.. ఈ 16 లక్షల మందికి పౌరసత్వ ప్రమాదం ఉన్నట్లే.