BigTV English

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కొత్త మలుపు.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, వైసీపీలో గుబులు

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కొత్త మలుపు.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, వైసీపీలో గుబులు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈడీ కూడా ఎంటరైంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో సోదాలు మొదలుపెట్టింది. దాదాపు రూ. 3,500 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డట్లు గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్‌లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కామ్ ఉందని గుర్తించింది. లిక్కర్ కుంభకోణంలో నిందితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తోంది.


ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లో మొత్తం 20 చోట్ల సోదాలు చేపట్టింది. నకిలీ ఇన్‌వాయిస్‌లు, షెల్ కంపెనీలు, బినామీలు, హవాలా ద్వారా కోట్లాది రూపాయాలు దారి మళ్లించిన వారిపై దృష్టి సారించింది.

ఈ క్రమంలో నిందితులతో సంబంధాలున్న కార్యాలయాలు, కంపెనీలతోపాటు 20 ప్రదేశాలలో దాడులు జరుగుతున్నాయి. కొంతమంది నిందితుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఏపీ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం-SIT గతంలో మాజీ సీఎం సహా ఉన్నత స్థాయి వ్యక్తులను పేర్కొంటూ రెండో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.


మొత్తం పది బృందాలు రంగంలోకి దిగాయి. తిరుపతి, బెంగుళూరు ప్రాంతాలకు బృందాలు చేరుకున్నాయి. కీలకమైన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మూడు ఛార్జీషీటులో పేర్కొన్న షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీల గురించి వివరాలు సేకరించారు. నిధులను హవాలా ద్వారా వేరే దేశాలకు పంపి బ్లాక్ మనీని వైట్‌గా చేశారన్నది ప్రధాన అభియోగం. 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు హైదరాబాద్ బంగారం షాపుల్లో ఇన్ వాయిస్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఆ ఎస్పీని టార్గెట్ చేసిన వైసీపీ

మూడురోజుల కిందట సిట్ నుంచి సమాచారం సేకరించింది ఈడీ. ఇప్పటి వరకు సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటులోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై ఫోకస్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్టు చేసింది సిట్. 2019-24 మధ్య కాలంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్- APSBSL నుండి రూ.10,500 కోట్లకు పైగా విలువైన కాంట్రాక్టులను పొందేందుకు 16 మద్యం కంపెనీలకు సుమారు రూ.1,660 కోట్లు ముడుపులు చెల్లించినట్టు SIT ఆరోపించిన విషయం తెల్సిందే.

డిస్టిలరీ కంపెనీల నుండి సేకరించిన నిధులను దారి మళ్లించడంలో ఇతరులతో కలిసి కుట్ర పన్నారనే అభియోగంతో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని నాలుగో నిందితుడిగా చేర్చింది. ఆ తర్వాత అరెస్టు చేసింది కూడా. జూలై మొదటివారంలో తెలంగాణలోని శంషాబాద్‌ ఏరియాలో సులోచనా గెస్ట్‌హౌస్‌లో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరుణ్ పురుషోత్తం 40వ నిందితుడిగా పేర్కొంది.

 

Related News

Temple Stampedes: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఆ ఎస్పీని టార్గెట్ చేసుకున్న వైసీపి.. ప్రభుత్వం ఘాటు రిప్లై!

AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు ఇవే

Big Stories

×