Temple Stampedes: ఏపీలో మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో దేవాలయాల్లో ఘటనల గురించి ప్రస్తావిస్తూనే అధికారుల బదిలీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. వైసీపీ సభ్యుల ప్రశ్నలపై అధికార పార్టీ ధీటుగా బదులిచ్చింది. మండలిలో అసలేం జరిగింది?
ఏపీలో మండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వంలో జరిగిన దేవాలయాల ఘటనలు మండలిని కుదిపేసింది. ఈ వ్యవహారంపై విపక్షం వైసీపీ-అధికార పార్టీకి పలు ప్రశ్నలు సంధించింది. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని పేర్కొంది వైసీపీ. వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి వరుసగా దేవాలయాల్లో జరిగిన ఘటనలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
తిరుమల ఘటనలో ఆరుగురు, సింహాచలం దేవాలయం వద్ద ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఆయా ఘటనలకు బాధ్యులు అయినవారిని ఎంత మందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తిరుమల ఘటనలో ప్రభుత్వ-టీటీడీ వైఫల్యం రెండూ ఉందన్నారు. ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది కాబట్టే ప్రమాదం జరిగిందన్నారు. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు ఎమ్మార్వోలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు చేపట్టారా? అంటూ ప్రశ్నించారు.
సౌకర్యాలు కల్పించే బాధ్యత టీటీడీదేనని సీఎం చెప్పారని, పాలకమండలిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈ ఘటనకు బాధ్యులైన ఆ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేశారని, మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ బదిలీల్లో మళ్లీ సుబ్బరాయుడుని తిరుపతి జిల్లా ఎస్పీగా ఎలా నియమించారని ప్రశ్న లేవనెత్తారు. ఎస్పీ సుబ్బరాయుడ్ని వైసీపీ టార్గెట్ గా చేసినట్టు కనిపిస్తోంది.
ALSO READ: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్, మేటరేంటి?
గతంలో తిరుపతి ఎస్పీగా ఆయనున్న సమయంలో మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా ఆయన్ని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడతామని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఇప్పుడు వైసీపీ సభ్యురాలు ఎస్పీ సుబ్బరాయుడును మళ్లీ తిరుపతి ఎస్పీగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఈ లెక్కన ఆ ఎస్పీ అంటే ఎందుకోగానీ వైసీపీలో గుబులు మొదలైనట్టు కనిపిస్తోంది.
దేవాలయాల్లో జరిగిన ఘటనలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారని, జిల్లా యంత్రాంగంతో సమీక్షలు చేశారన్నారు. రెండురోజులు జరిగి వైకుంఠ ఏకాదశిని పది రోజులకు మార్చారని అన్నారు. ఆ సమయంలో తిరుమలలో ఇవ్వాల్సిన టికెట్ కౌంటర్లను తిరుపతికి తెచ్చారన్నారు. ఘటన నేపథ్యంలో పలువురు అధికారులను పక్కనపెట్టి విచారణ జరిగిందన్నారు.
బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెచ్చారు. జ్యుడీషియల్ కమిషన్ ఓ ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌లపై ఎలాంటి సంబంధం లేదని నివేదిక ఇచ్చిందన్నారు. వారిపై ప్రభుత్వం ఏవిధంగా చర్యలు తీసుకుంటుదని అన్నారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్షనాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేసినదాన్ని తప్పుబట్టారు సదరు మంత్రి. దీనిపై వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధం సాగింది. పరామర్శ పేరుతో ఆసుపత్రులపై దాడులా అంటూ మండిపడ్డారు.
తిరుమల ప్రమాదంలో ప్రభుత్వ, TTD వైఫల్యం ఉంది : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
దేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు
ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టే ప్రమాదం జరిగింది
తిరుమల ఘటనలో ఆరుగురు, సింహాచలం ఘటనలో ఏడుగురు చనిపోవడం బాధాకరం
ఈ ఘటనలకు బాధ్యులు అయిన వారిని… pic.twitter.com/yLaAPlCwOP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025