E-Paper
Advertisement

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. వైసీపీలో గుబులు మొదలు, మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు..  వైసీపీలో గుబులు మొదలు, మాజీ మంత్రి కొడుకు అరెస్ట్
Advertisement

AP Liquor Scam Case:  ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటికే కొందర్ని అరెస్టు చేసిన ఈడీ, తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకుని అరెస్ట్ చేసింది. దీంతో వైసీపీలో కొత్త గుబులు మొదలైంది. తర్వాత రేసులో ఉన్నది ఎవరంటూ చర్చించుకోవడం ఆ పార్టీలో మొదలైంది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. వైసీపీలో గుబులు మొదలు

Advertisement

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ కేసును లోతుగా విచారిస్తున్న ఈడీ, ఒకరి తర్వాత మరొకర్ని అరెస్టులు చేస్తోంది. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ కుమార్‌ గురువారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.

మద్యం రవాణా టెండర్ల దక్కించుకోవడం, నిధుల మళ్లింపులో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కారుమూరి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేసిన కొద్ది రోజులకు అరెస్టు చేయడంతో వైసీపీలో గుబులు మొదలైంది.

Advertisement

మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్ చేసిన ఈడీ

వైసీప హయాంలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా జరిగిన రూ.195 కోట్ల మద్యం రవాణా కుంభకోణంలో సునీల్ కుమార్ మీడియేటర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ సిండికేట్ లీడర్లు, స్థానిక కాంట్రాక్టర్లకు మధ్య వారధిగా సునీల్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.

దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. బినామీ సంస్థగా అనుమానిస్తున్న సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సుదర్శన కన్స్ట్రక్షన్స్ కు అనుకూలంగా ఓ ఒప్పందాన్ని అమలు చేయడంలో తండ్రి పలుకుబడిని సునీల్ కుమార్ ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆనాటి ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ‌రెడ్డితో సునీల్ తండ్రికి సంబంధాలు ఉన్నాయని సందీప్, సూర్య‌ప్రతాప్‌రెడ్డిలకు చెప్పినట్లు సమాచారం. ఎంపిక చేసిన సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చేలా రాజ్‌రెడ్డి, కిరణ్ కుమార్‌లతో అతడు పరిచయాలు ఉపయోగించుకున్నాడని అధికారులు ఆరోపిస్తున్నారు.

ALSO READ: భూ కబ్జా ఆరోపణలు.. కోర్టులో పవన్‌కు బిగ్ రిలీఫ్.. సంచలన ఉత్తర్వులు జారీ

ఈడీ తన దర్యాప్తులో భాగంగా ఒప్పందాల కింద జరిగిన ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు.  వైద్య పరీక్షలు తర్వాత నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ-PMLA కోర్టులో హాజరు పరచనుంది.  విచారణ నిమిత్తం సునీల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేయనున్నారు.

కారుమూరి నాగేశ్వరరావు కొడుకు అరెస్టు కావడంతో వైసీపీలో గుబులు మొదలైంది. సిట్ విచారణలో బయట పడకుండా తప్పించుకున్న సునీల్, ఈడీకి దొరికిపోయారని కొందరు నేతలు అంటున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో కీలక నేతల ప్రమేయం ఉండే అవకాశముందని చర్చించుకుంటున్నారు నేతలు.

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×