AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లోని ఓట్ల పండగ మొదలైంది. గ్రామాల అభివృద్ది నేపథ్యంలో ఎలాంటి విభేదాలు పోకుండా అందరూ ఒకే తాటి మీదకు వచ్చేలా బంపరాఫర్ ఇచ్చింది ప్రభుత్వం. తమతమ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే రూ. 50 వరకు నజరానా ఇస్తామని పేర్కొంది. దీంతో ఓటర్ల కాస్త ఆలోచనలో పడ్డారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 13,354 పంచాయతీలు ఉండగా అందులో 13,168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసుల కారణాల వల్ల కొన్ని పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు నోటిఫికేషన్ నేడు విడుదలైంది. 26న 4180 పంచాయతీల సర్పంచ్‌లు, 42 వేల వార్డులకు పోలింగ్ జరగనుంది.
రెండో విడత ఎన్నికలకు 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. 4715 పంచాయతీల సర్పంచ్‌లు, 47,048 వార్డుల 29న పోలింగ్ జరగనుంది. చివరి విడత 4273 సర్పంచ్‌లు, 42,794 వార్డులకు ఈనెల 19న నోటిఫికేషన్ జారీకానుంది. డిసెంబరు 2న పోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే. ఆ తర్వాత ఓట్లు లెక్కింపు తర్వాత తుది ఫలితాలు ఆ రోజు ప్రకటిస్తారు.