E-Paper
Advertisement

130 కి.మీ వేగం.. 320 కి.మీ ప్రయాణం.. దేశంలోనే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

130 కి.మీ వేగం.. 320 కి.మీ ప్రయాణం.. దేశంలోనే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
Advertisement

Long-Range EV Scooter Ola S1 Pro+: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారు ముందుగా చూసేది దాని రేంజ్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చు? బ్యాటరీ సామర్థ్యం ఎంత? గరిష్ట వేగం ఎంత? అనే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి వారికి ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్లలో ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన S1 సిరీస్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5.2 kWh బ్యాటరీతో వచ్చే ఓలా S1 Pro+ ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 320 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

5.2 kWh బ్యాటరీ కెపాసిటీ

ఓలా S1 Pro+లో 5.2 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. వాస్తవ ప్రయాణంలో రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్, రైడింగ్ వేగం, వాతావరణం, రైడర్ బరువు లాంటి అంశాలను బట్టి రేంజ్ మారుతుంది. ఈ స్కూటర్‌లో 13 kW పీక్ పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది మంచి వేగంతో పాటు వేగవంతమైన యాక్సిలరేషన్‌ను కూడా అందిస్తుంది. కేవలం 2.1 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

గరిష్ట వేగం ఎంతంటే?

Advertisement

ఓలా S1 Pro+ 5.2 kWh వేరియంట్ గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో Hyper, Sports, Normal, Eco అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రైడర్లు తమకు నచ్చిన మోడ్‌ను ఎంచుకోవచ్చు. వేగం, బ్యాటరీ వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మోడ్‌లు ఉపయోగపడతాయి.

ఛార్జింగ్, బ్రేకింగ్ ప్రత్యేకతలు

ఈ స్కూటర్‌లో బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ABS లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్లు అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రోజువారీ ప్రయాణాలతో పాటు ఎక్కువ దూరం వెళ్లేవారికి కూడా ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.

ధర ఎంత అంటే?  

Advertisement

ఓలా S1 Pro+ 5.2 kWh ధర సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల మధ్య (ఎక్స్‌ షోరూమ్) ఉండవచ్చు. సిటీని బట్టి, అందుబాటులో ఉన్న ఆఫర్లను బట్టి ధరలో మార్పులు ఉంటాయి. ఎక్కువ రేంజ్, మంచి వేగం, అత్యాధునిక  ఫీచర్లు కోరుకునే వారికి ఈ స్కూటర్ బాగుంటుంది. అయితే, కొనే ముందు రియల్ రేంజ్, ఛార్జింగ్ టైమ్, సర్వీస్ సదుపాయాలను కూడా చెక్ చేయడం మంచిది.

Read Also: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? 300 కి.మీ రేంజ్ ఇచ్చే సూపర్ మోడల్స్ ఇవే!

Tags

Related News

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? 300 కి.మీ రేంజ్ ఇచ్చే సూపర్ మోడల్స్ ఇవే!

టాటా To ఎంజీ.. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

సింగిల్ ఛార్జ్ తో 600 కి.మీ ప్రయాణం.. ఇండియాలో టాప్ 5 లాంగ్ రేంజ్ ఈవీ కార్లు ఇవే!

కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఏకంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు!

రూ.50 వేల లోపు 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేంజ్, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

రెనాల్ట్ డస్టర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. హైబ్రిడ్ మోడల్ డెలివరీలు షురూ!

రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. డస్టర్‌పై ఏకంగా రూ.2.10 లక్షల బెనిఫిట్స్!

Big Stories

Advertisement
×