E-Paper
Advertisement

సరిగమప షోకి వెళ్లడం వెనుక అసలు కారణం చెప్పేసిన అనిల్ రావిపూడి!

సరిగమప షోకి వెళ్లడం వెనుక అసలు కారణం చెప్పేసిన అనిల్ రావిపూడి!
Advertisement

Anil Ravipudi:అనిల్ రావిపూడి..టాలీవుడ్ లో హిట్ మెషిన్ గా పేరొందిన ఈ క్రేజీ యంగ్ ఫిలిమ్ మేకర్ ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటూనే, మరోవైపు టీవీ షోలలో కూడా తనదైన అప్పీరియన్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాడు.

ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమయ్యే ‘సరిగమప’ షోలో ఆయన చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే అంత పెద్ద పెద్ద సినిమాలతో ఇంత బిజీగా ఉండే అనిల్ రావిపూడి ఒక సింగింగ్ షో కోసం టైమ్ ఎలా ఇస్తున్నాడు ఈ షోకి రావడానికి అనిల్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ? అనే డౌట్స్ అటు అభిమానుల్లో ,ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.ఇక ఇదే విషయమై తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లో క్లారిటీ ఇచ్చేశాడు.

Advertisement

సాధారణంగా ఒక స్టార్ డైరెక్టర్ అంటే సినిమా షూటింగ్స్, స్టోరీ డిస్కషన్స్ , హీరోల డేట్స్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారన్న సంగతి తెల్సిందే.అలాంటిది ప్రతి నెలా ఒకటి రెండు రోజులు టీవీ షోల కోసం కేటాయించడం వెనుక ఒక స్పెషల్ రీజన్ ఉందని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.

తన సినిమాలను కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇష్టపడతారని , ప్రతి ఏడాది తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కుటుంబమంతా కలిసి థియేటర్లకు వస్తుంటారని తెలిపాడు .అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇంకా దగ్గరగా ఉండాలనే కోరిక తనకు ఉందని , సినిమాల ద్వారా వాళ్లను థియేటర్లలో ఎంటర్‌టైన్ చేస్తున్నానని, టీవీ షోల ద్వారా డైరెక్ట్ గా వాళ్ల ఇళ్లలోకి వెళ్లి నవ్వించాలని అనుకుంటానని అసలు విషయం బయటపెట్టాడు.

Advertisement

అందుకే షూటింగ్స్ ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒకటి రెండు రోజులు టైమ్ చేసుకుని ‘సరిగమప’, ‘డ్రామా జూనియర్స్’ లాంటి షోలలో పాల్గొంటానని తెలిపాడు.అక్కడికి వెళ్లినప్పుడు తాను ఒక పెద్ద డైరెక్టర్‌ననే ఫీలింగ్ అస్సలు ఉండదని, షోలో ఉన్నవాళ్లు ఏం చేయమంటే అది చేయడానికి రెడీగా ఉంటానని చెప్పుకొచ్చాడు. స్కిట్లు వేయడం, డ్యాన్స్ చేయడం, సరదాగా కౌంటర్లు వేయించుకోవడం ఇలా ఆడియన్స్ ఏది ఇష్టపడితే అందులో భాగమవుతానని వివరించాడు ఈ క్రేజీ డైరెక్టర్.

ఇక డైరెక్టర్‌గా తన స్థాయి గురించి మాట్లాడుతూ ప్రతి సినిమాను తనకు ఫస్ట్ సినిమాలాగే ఫీల్ అవుతానని, ఒక రేంజ్‌కి వెళ్లిపోయాననే ఆలోచనతో ముందుకు వెళ్తే తర్వాతి సినిమాపై టెన్షన్ పెరుగుతుందని అన్నాడు . అందుకే ఎప్పుడూ చాలా సింపుల్‌గా, ఎలాంటి ఈగో లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని తెలిపాడు .

ఇక ఈ సీజన్ ‘సరిగమప’ గురించి మాట్లాడుతూ యాంకర్ సుడిగాలి సుధీర్, ఇమ్మాన్యుయేల్ అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తున్నారని అనంత శ్రీరామ్‌తో తన కాంబినేషన్ టామ్ అండ్ జెర్రీలా ఉంటుందని సరదాగా చెప్పుకొచ్చాడు .

ముఖ్యంగా ఎస్పీ శైలజ గారు ఈ సీజన్‌కు ఆమె 2.0 వెర్షన్‌లా మారిపోయారని, ఆమెలో ఇంత కామెడీ టైమింగ్ ఉందని తాను కూడా ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అనిల్ . మొత్తానికి బిజీగా ఉంటూనే సరిగమపలో పాల్గొనడానికి కారణం ఇలా బయటపెట్టేశాడు ఈ టాలీవుడ్ హిట్ మెషీన్ !

also read:రాము రాథోడ్, లిఖిత కాంబోలో టాప్ 5 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్!

Tags

Related News

కెప్టెన్ అయ్యాక కొమ్ములొచ్చాయా? అమన్ మసూద్ కు క్లాస్ పీకిన నాగార్జున!

రాము రాథోడ్, లిఖిత కాంబోలో టాప్ 5 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్!

నీది చీప్ క్యారెక్టర్.. క్షమాపణ చెప్పాల్సిందే..వర్షిణి, త్రిగుణ్ పై నాగ్ సీరియస్!

నలుగురు దర్శకులు రిజెక్ట్.. నెట్టింట ట్రెండింగ్ లో నిలిచిన ‘కొయిల’ సాంగ్..

చెయ్యి చేసుకోబోయిన రోహిత్.. షో నుంచి వెళ్లిపోయిన మిథిలేష్!

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ బయట పెట్టిన ఝాన్సీ… ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?

ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !

Big Stories

Advertisement
×