E-Paper
Advertisement

‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!

‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!
Advertisement

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఏపీ సీఎం చంద్రబాబు సూటి ప్రశ్న సంధించారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మీరు చూపే పరిష్కారం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాదికి ఏమాత్రం నష్టం కలగకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ వద్ద ఉన్న నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటో బయటపెట్టాలని ఆయన కోరారు.

చంద్రబాబు ఏమన్నారంటే?

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. డీలిమిటేషన్ బిల్లుపై తనకున్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్లమెంట్ సీట్లను 50 శాతం పెంచి అందులో మూడో వంతు (33 శాతం) మహిళలకు కేటాయించడమే ఈ రెండు సమస్యలకు ఏకైక పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని, బాధ్యతను గుర్తుచేస్తూ రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు వేశారు.

‘మీరు చెప్పే పరిష్కారం ఏంటి? ‘

Advertisement

నిన్నటి వరకూ రాహుల్ కేరళ ఎంపీగా చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రం తరపున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పైగా దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్ (తెలంగాణ, కర్ణాటక, కేరళ)లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందన్నారు. మరి దక్షిణాది ప్రయోజనాలను కాపాడేందుకు వారు ప్రతిపాదిస్తున్న పరిష్కారం ఏంటి? అని చంద్రబాబు నిలదీశారు.

‘అలా చేస్తే దక్షిణాదికి నష్టం’

తాజా జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో దక్షిణాది గొంతుక బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే పురుషుల ప్రాతినిధ్యం తగ్గిపోయి కొత్త సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. కాబట్టి దీనికి అత్యుత్తమ మార్గం.. లోక్ సభ సీట్లను 50 శాతం పెంచి.. పెరిగిన స్థానాల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ చేయాలని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రాల వారీగా పెంపు ఇలా..

Advertisement

ఈ ప్రతిపాదిత ఫార్ములా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు 129 నుంచి 195కు పెరుగుతాయని చంద్రబాబు అన్నారు. దీనివల్ల దేశవ్యాప్త సీట్లలో దక్షిణాది వాటా 23.76 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని తెలిపారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 నుంచి 38కి, తమిళనాడు 39 నుంచి 59కి, కర్ణాటక 28 నుంచి 42కి, తెలంగాణ 17 నుంచి 26కి, కేరళ సీట్లు 20 నుంచి 30కి పెరుగుతాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పార్లమెంట్ స్థానాల పెంపు వల్ల ప్రజాప్రతినిధులపై ఉన్న పనిభారం కూడా గణనీయంగా తగ్గుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ డబుల్ గేమ్.. కేసీఆర్‌ను ఉతికారేసిన అద్దంకి!

ఏకాభిప్రాయానికి రావాలి: చంద్రబాబు

ప్రస్తుతం ఒక్కో ఎంపీ సుమారు 27 నుంచి 28 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సీట్ల పెంపు తర్వాత ఆ సంఖ్య సుమారు 18 లక్షలకు తగ్గుతుందని ఆయన చెప్పారు. అటు మహిళా రిజర్వేషన్ అనేది ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. రాజకీయ విభేదాల కారణంగా ఈ చరిత్రాత్మక బిల్లును అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. వికసిత్ భారత్ – 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ తరుణంలో అందరూ ఏకాభిప్రాయానికి రావాలని పిలుపునిచ్చారు.

Also Read: Airtel రూ.598 ప్లాన్.. అపరిమిత 5Gతో పాటు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 ఫ్రీ.. వ్యాలిడిటీ ఎంతంటే?

Tags

Related News

నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!

తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!

మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి

రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలకు ఎంట్రీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

విశాఖ హైవేపై భయానక ఘటన.. టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!

Big Stories

Advertisement
×