E-Paper
Advertisement

తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!

తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!
Advertisement

Tirumala Gold Recovery: తిరుమల కొండపై విజిలెన్స్ అధికారులు మరోమారు చాకచక్యంగా వ్యవహరించి పోగొట్టుకున్న బంగారాన్ని భక్తుడి చెంతకు చేర్చారు. దాదాపు 60 గ్రాముల బంగారు ఆభరణాలను గంటల వ్యవధిలోనే తిరిగి బాధితుడికి అందించారు. దీంతో విజిలెన్స్ అధికారుల పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..

అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన జి. మహేష్ అనే భక్తుడు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చాడు. నవంబర్ 27న స్థానిక సీఆర్ఓ (CRO) ఆఫీస్ బస్ స్టాప్ వద్ద కారు దిగే తొందరలో ఆయన వద్ద ఉన్న బంగారు ఆభరణాల కింద పడ్డాయి. కొద్దిసేపటి తర్వాత నగలు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన మహేష్.. వెంటనే తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు.

సీసీటీవీలో నిందితులు గుర్తింపు

Advertisement

బాధితుడి ఫిర్యాదుతో తక్షణమే రంగంలోకి దిగిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. కిందపడిన బంగారు నగలను ఇద్దరు వ్యక్తులు తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. ఆ ఇద్దరి కదలికలను సీసీ కెమెరాల ద్వారా ట్రాక్ చేసిన సిబ్బంది.. దాని ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన మొదటి వ్యక్తిని గుర్తించి అతని వద్ద నుంచి 52 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నారాయణగిరి షెడ్ నంబర్ 7 వద్ద ఉన్న రెండో వ్యక్తిని పట్టుకుని అతని వద్ద ఉన్న 8 గ్రాముల ఉంగరాన్ని రికవరీ చేశారు.

భక్తుడికి ఆభరణాల అప్పగింత

ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్, ఒక ఉంగరంతో కలిపి మొత్తం 60 గ్రాముల బంగారు ఆభరణాలను అధికారులు పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. అనంతరం నవంబర్ 28వ తేదీ ఉదయం 6:30 గంటలకు విజిలెన్స్ అధికారులు బాధితుడు మహేష్‌ను పిలిపించి ఆ ఆభరణాలను అప్పగించారు.

Advertisement

Also Read: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్!

అధికారుల పనితీరుపై ప్రశంసలు

పోగొట్టుకున్న బంగారం తిరిగి దక్కడంతో భక్తుడు మహేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన సంతోషాన్ని, కృతజ్ఞతను వీడియో రూపంలో టీటీడీ ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌లో నమోదు చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కేవలం కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన విజిలెన్స్ అధికారులు, కమాండ్ కంట్రోల్ సిబ్బందిని తోటి భక్తులు సైతం ఎంతగానో అభినందిస్తున్నారు.

Also Read: మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!

Tags

Related News

మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి

రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలకు ఎంట్రీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

విశాఖ హైవేపై భయానక ఘటన.. టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!

మనసు మార్చుకున్న వైసీపీ అధినేత.. నోటీసుల విషయంలో జగన్ వెనక్కి? ఈసారి కారణమేంటి?

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు, మరి వైసీపీ మాటేంటి?

Big Stories

Advertisement
×