ప్రపంచంలోనే అత్యతం వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంలో చైనా ముందుంటుంది. అందులో భాగంగానే CR450 బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. ఈ రైలుకు సంబంధించిన ప్రీ- సర్వీస్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షల్లో CR450 సరికొత్త రికార్డును నెలకొల్పింది. షాంఘై-చాంగ్కింగ్-చెంగ్డు హై స్పీడ్ రైల్వే లైన్ లో ఈ ట్రయల్స్ కొనసాగాయి. ఈ పరీక్షల్లో CR450 రైలు ఏకంగా 281 mph (450 km/h) గరిష్ట వేగాన్ని అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.
చైనా ఆవిష్కరించింది. అప్పట్లో ఈ రైలు 249 mph (400 km/h) వేగాన్ని అందుకోవడానికి రూపొందించబడింది. కానీ, ఇప్పుడు ఆ రైలు గరిష్ట వేగం ఏకంగా 281 mph (450 km/h)కి చేరింది. ఇప్పటికే ఈ రైలును అన్ని రకాలుగా పరీక్షించారు. చివరి దశలో భాగంగా ఈ రైలు, రైలు 600,000 కిలోమీటర్ల ఆపరేషనల్ పరీక్షను పూర్తి చేసిన తర్వాత 2026లో కమర్షియల్ సర్వీసులు అందించనుంది.
చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ (CRRC) ఆధ్వర్యంలో CR450 రైలును తయారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీని మరింత అప్ డేట్ చేసి దీనిని తయారు చేశారు. అత్యధిక వేగాన్ని అందించేందుకు ఈ రైలు ముక్కు కోన్ 12.5 మీటర్ల నుంచి 15 మీటర్లకు పెంచారు. అయితే, పూర్తిగా మూసివేయబడిన బోగీలు, ఏరోడైనమిక్ లోయర్ స్కర్ట్ ప్యానెల్స్ డ్రాగ్ ను 22 శాతం తగ్గిస్తాయి. ఈ రైలు గత మోడల్స్ తో పోల్చితే 20 సెంటీమీటర్లు తక్కువగా, 55 టన్నుల తేలికైనదిగా రూపొందించారు. ఈ జాగ్రత్తలు రైలు అత్యధిక వేగంగా ప్రయాణం చేసేందుకు సహకరిస్తున్నాయి.
Read Also: తొలిసారి ఆ మార్గంలో ఖాళీ రైళ్లను నడుపుకునేందుకు అనుమతి, రైల్వే కీలక నిర్ణయం!
CR450 కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుంచి 350 కిమీ/గం (217 mph) వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రస్తుత CR400 ఫక్సింగ్ రైళ్ల కంటే ఒక నిమిషం కంటే ఎక్కువ. ఈ రైలు నిర్మాణంతో హై స్పీడ్ రైలు సాంకేతికతలో ‘మేడ్ ఇన్ చైనా’ నుంచి ‘క్రియేటెడ్ ఇన్ చైనా’కు చేరుకుందని అక్కడి టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇది చైనా రవాణా ఆవిష్కరణలో పెరుగుతున్న నైపుణ్యాన్ని సూచిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, వచ్చే ఏడాది ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కమర్షియల్ ట్రైన్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.
Read Also: ప్రయాణీకుల కోసం వెయిటింగ్ జోన్లు, ఇక ఆ స్టేషన్లలో రద్దీ కనిపించడదట!