BigTV English
Advertisement

Jubilee Hills Election: రంగంలోకి కేసీఆర్.. ‘జూబ్లిహిల్స్’ సమీకరణాలు మార్చేస్తారా?

Jubilee Hills Election: రంగంలోకి కేసీఆర్.. ‘జూబ్లిహిల్స్’ సమీకరణాలు మార్చేస్తారా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్ధ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ప్రధాన పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగ్గట్లుగానే మూడు పార్టీలు.. అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి.


ప్రతిష్టాత్మంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

అధికార, విపక్ష పార్టీలకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. కాంగ్రెస్ స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పాలనకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పరీక్షగా మారడంతో.. పార్టీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండు నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్‌ వెంకటస్వామిలకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా ఇంటింటి ప్రచారం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట.

త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌ షో

పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేసేలా పీసీసీ వ్యూహారచరన చేస్తుందట. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని కాంగ్రెస్‌ భావిస్తుంది. గ్రేటర్‌లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది.


జీహెచ్ఎంసీ పీఠం గులాబీ దళం కైవసం చేసుకుంటుందా?

బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్‌లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పని చేస్తుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితలో కేసీఆర్ పేరును పెట్టింది బీఆర్ఎస్.

బీఆర్ఎస్ పార్టీల ఇంటింటి ప్రచారం

బీఆర్‌ఎస్‌ వెల్లడించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్‌ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఒకటి రెండు సభలకు కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్ర నాయకులు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచార పర్వాన్ని కూడా అదేరీతిన కొనసాగిస్తోంది. ముఖ్యనేతలకు డివిజన్ల వారీగా నాయకులకి బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంటు, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారట.

ప్రచారానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్‌లోనే మోహరించడంతో..నియోజకవర్గంలో సందడి నెలకొంది. బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్‌ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్‌ పీఠం తప్పక తమదేనని బీజేపీ భావిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జుబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్‌తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. ప్రచారానికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందని కాషాయ దళం చెబుతున్న పరిస్ధితి.

ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్

మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత జూబ్లీహిల్స్ లో వచ్చిన బైపోల్స్ లో BRS పార్టీ తిరిగి మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది. అందరికంటే ముందుగానే BRS పార్టీ తమ అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారం కూడా మొదలు పెట్టింది . ఈ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకుని రానున్న GHMC,స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా BRS పార్టీ చక్రం తిప్పాలని చూస్తుంది . గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు

40 మంది స్టార్ క్యాంపెయినర్స్ ‌తో BRS భేటీ

అయితే జూబ్లీ వార్ లో తిరిగి తమ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట గులాబీబాస్. అందులో భాగంగా ఎర్రవల్లి లోని ఫాంహౌస్ లో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాజాగా నిర్వహించిన ఆ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జూబ్లీహిల్స్ ఇంచార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే BRS పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును విడుదల చేసింది

కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారా?

పార్టీ విడుదల చేసిన స్టార్ కాంపెయిన్ లిస్ట్ లో మొదటి పేరు కేసీఆర్ దే అవ్వడం గమనార్హం.. దీంతో గులాబీ పార్టీ వర్గాల్లో కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటారు అని చర్చ నడుస్తుంది . ఈ నెల చివరన కేసీఆర్ జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ చేస్తారు అన్న వార్తతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటే మాగంటి సునీత గెలుపును ఎవ్వరు ఆపలేరు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది . ప్రజల్లో కేసీఆర్ మాటలకు, ఆయన వాక్చాతుర్యునికి , మంచి స్పందన ఉందనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ నిజంగానే ప్రచారంలో పాల్గొంటారో? లేదో.

Story by BigTv

Related News

Palakurthi Politics: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

Kesineni Vs Kolikapudi: కొలికపూడి కేశినేని మధ్య వార్.. చంద్రబాబు నిర్ణయం ఇదే?

TFI on Reviewers: తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా?

America Vs Russia: వలపు వల.. అమెరికా విలవిల, టెక్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్లన్నీ బయటకు.. ఇది ఎవరి పని?

JC Prabhakar Reddy: తాడిపత్రిలో టెన్షన్.. జేసీపై ఎస్పీ ప్లాన్ ఏంటి?

Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి షాక్.. హైకమాండ్ ప్లాన్ ఏంటి?

Bhimavaram: ఆర్ఆర్ఆర్‌పై జనసేన ఆగ్రహం.. అంత తొందర ఎందుకో?

Big Stories

×