ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి జగన్ చెప్పిన సరికొత్త అర్థం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఈ టాపిక్ ని హైలైట్ చేస్తూ జగన్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ జగన్ ఏమన్నారు. జనం ఎందుకంతలా నవ్వుకుంటున్నారు.
జగన్ పై ట్రోలింగ్..
జగన్ ప్రెస్ మీట్ పెడితే ట్రోలర్లకు పండగేనని అంటుంటారు. ఈసారి ఆయన 4 అంశాలపై 2 గంటలకు పైగా మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఎడిటెడ్ వెర్షన్ విడుదల చేసేవారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు మీడియాని పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఆయన కాస్త ఇబ్బంది పడుతూ సమాధానాలిచ్చారు. వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్పారు జగన్. డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. ఏఐ గురించి జగన్ చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏఐకి జగన్ ఇచ్చిన డెఫినిషన్ ఇంకెవరూ ఇవ్వలేరని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఏఐకి కొత్త నిర్వచనం..
టీడీపీ నేతలు కూడా ఈసారి జగన్ ని ట్రోల్ చేయడం విశేషం. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సహా ఇతర నేతలు కూడా జగన్ వీడియోని పోస్ట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి నాయకుడు ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేశారంటే ఆశ్చర్యం వేస్తుందన్నారాయన.
డేటా కు మైండ్ అప్లై చేస్తే అది AI అవుతుంది.
Wahh Anna Wahh.… Probably the dumbest definition I’ve ever heard from an Ex-CM.
అయ్యా @ysjagan Garu,
“డేటా కు మైండ్ అప్లై చేస్తే అది AI అవుతుంది”, "WiFi కి battery పెడితే Satellite అవుతుంది లాంటి అర్థం లేని మీ మాటలు వింటుంటే… pic.twitter.com/hb0ecLRkP0
— Adireddy Srinivas (@Adireddy_Vasu) October 24, 2025
అసెంబ్లీకి రాకుండా జగన్ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుందా అనే అనుమానం వైసీపీ నేతలకు కూడా ఉంది. ఉపయోగం ఉండకపోగా, దానివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం ఇక్కడ మరో విశేషం. కూటమిని ఇరుకున పెట్టాల్సిన సందర్భంలో తన వ్యాఖ్యలతో తనకు తానే జగన్ ఇరుకున పడ్డారని తెలుస్తోంది.
Also Read: ఆ ఘనత మాదే.. వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై జగన్ యూ టర్న్
గుడివాడ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్..
మొత్తమ్మీద జగన్ ప్రెస్ మీట్ కూటమి నేతలకు, ట్రోలర్లకు బాగానే పని చెప్పిందనుకోవాలి. అదే సమయంలో వైసీపీ నేతలకు కూడా కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. వైజాగ్ కి వస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో పర్యావరణానికి ముప్పు ఉంటుందని మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాత్మ కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు జగన్ తన ప్రెస్ మీట్ లో కౌంటర్ ఇచ్చినట్టయింది. గూగుల్ రాకను తాము స్వాగతిస్తున్నామన్నారు జగన్. అసలు గూగుల్ సంస్థ రావడానికి కారణం తానేనని చెప్పారు. అప్పట్లో తాము అదానీ డేటా సెంటర్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని, అదే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఒకవేళ ఎవరైనా వాతావరణ కాలుష్యం జరుగుతుందని భావిస్తే వారే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ నేతలు డేటా సెంటర్ ని స్వాగతించకపోవడం వల్ల విమర్శలు ఎదుర్కొంటే, కాస్త ఆలస్యంగా ఆ వ్యవహారంపై పూర్తి రివర్స్ లో స్పందించి మరోసారి పార్టీ నేతల్ని ఇరుకున పెట్టారు, తనకు తానే ఇరుకున పడ్డారు జగన్. ప్రెస్ మీట్ వల్ల ఆయన కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకున్నారు కానీ, తనకు తానే ట్రోలర్లకు టార్గెట్ అయ్యారని అంటున్నారు నెటిజన్లు.
Also Read: షర్మిలాను చూసైనా జగన్ నేర్చుకుంటారా?