E-Paper
Advertisement

Aravind Sridhar: అరవ శ్రీధర్ యవ్వారం.. మరో కొత్త ఎత్తుగడ, ఈసారి ఏకంగా

Aravind Sridhar: అరవ శ్రీధర్ యవ్వారం.. మరో కొత్త ఎత్తుగడ, ఈసారి ఏకంగా
Advertisement

Aravind Sridhar: అరవ శ్రీధర్‌ వ్యవహారంపై జనసేన పార్టీలో ఏం జరుగుతోంది? ఎందుకు మహిళా ఉద్యోగి మరొక వీడియో రిలీజ్ వెనుక అసలు కథేంటి? విచారణ చేస్తున్న ఆ పార్టీ కమిటీకి ఇదొక అస్త్రం దొరికిందా? ఎందుకు ఆమె కొత్త వెర్షన్ తెరపైకి తెచ్చింది? ఇవే ప్రశ్నలు జనసేన నేతలు, కార్యకర్తలను వెంటాడుతోంది.

అరవ శ్రీధర్ యవ్వారం.. కొత్త ఎత్తుగడ

Advertisement

పార్టీ విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అవర శ్రీధర్ హాజరయ్యేందుకు కొద్దిగంటల ముందు బాధిత మహిళా మరొక వీడియో విడుదల చేసింది. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని విన్నవించింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు పొగొట్టవద్దని అందులో ప్రస్తావించింది. ఆయనకు చాలా పేరు ఉందని, దీనిపై ఆయన ఏం చేస్తారో తనకు తెలీదని మనసులోని మాట బయపెట్టింది.

అంతేకాదు అదే సమయంలో శ్రీధర్‌పై మాటలపై ఆమె తన వేడిని పెంచింది. నువ్వు పక్కదారి పడుతున్నావని, డబ్బులకు అమ్ముడు పోయావంటూ దూషించింది సదరు మహిళ. ఈ సమస్య తాను ఆపకుంటే.. రేపటి రోజున చాలామంది తయారు అవుతారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను కోల్పోవడానికి ఏమీ లేదని, అంతా పోయిందంటూ మనసులోని మాట బయటపెట్టింది.

Advertisement

బాధితురాలి మరో వీడియోపై శ్రీధర్ మద్దతుదారులు ఆగ్రహం

న్యాయం ఏంటో తెలుసుకోవాలని ఉందని, నిజాలు అందరికీ తెలియ జేయాలని పేర్కొంది. అందుకే తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అసలు నిజాలు రావాలంటే శ్రీధర్-తన ఫోన్ పరిశీలిస్తే అన్నీ బయటకు వస్తాయని చెప్పకనే చెప్పింది. మహిళ ఉద్యోగి.. కొత్త వీడియో విడుదలపై శ్రీధర్ మద్దతుదారులు మండిపడుతున్నారు.

కావాలనే మహిళను ఎవరో రెచ్చగొడుతున్నారని, అందుకే ప్రతీ రోజు తన వ్యవహారం వార్తల్లో నిలిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తాను పరారీలో ఉన్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది. తన వద్ద ఒక్క ‌ఫోన్ మాత్రమే ఉందని తెలిపింది. దాని ద్వారా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించింది.

తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం జరుగుతోందని, డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో మరొక వ్యక్తిపైనా ఆరోపణలు గుప్పించింది.  ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు శ్రీధర్. ఈ వ్యవహారం గురించి ఆయన ఇంకెంత సమాచారం కమిటీకి ఇస్తారో చూడాలి.

ALSO READ: అంబటి కోసం జగన్ కాదట.. పవన్ దిగి రావాలట.. ఇదేం దిక్కుమాలిన లాజిక్కో..!

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×