Shoaib Akhtar On PCB: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడం పై వివాదం రాజుకంటోంది. పాకిస్తాన్ ఇలా అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో మ్యాచ్ బహిష్కరించడం చాలా తప్పుడు నిర్ణయం అంటూ ఫైర్ అయ్యారు. అసలు ఇండియాతో పాకిస్తాన్ పెట్టుకోకూడదని చురకలు అంటించారు. ఇలా ఐసీసీ ( ICC) ఈవెంట్స్ లో వ్యవహరిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు షోయబ్ అక్తర్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా పాకిస్తాన్ ఆడాలని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా ఆడకపోతే ఇండియాను చూసి పాకిస్తాన్ భయపడి పారిపోయిందని ట్రోలింగ్ చేయడం గ్యారంటీ అంటూ హితువు పలికారు. ఎప్పుడైనా ఇండియాతోనే పాకిస్తాన్ కు అవసరం ఉంటుంది.. పాకిస్తాన్ తో ఇండియాకు ఎలాంటి అవసరం ఉండబోదు అంటూ గుర్తు చేశారు. అలాగే ఐసీసీ నుంచి వచ్చే నిధులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ( PCB ) చాలా అవసరమని వెల్లడించారు షోయబ్ అక్తర్.
ఈ విషయాలను గుర్తు పెట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB ) ముందుకు సాగాలని కోరారు. లేకపోతే అడుక్కు తింటారని హెచ్చరించారు. అన్ని మూసుకొని ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడండి అంటూ సూచనలు చేశారు షోయబ్ అక్తర్. అలా ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పుల్లో కూరుకుపోవడం గ్యారంటీ అన్నారు. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాగే అక్కడి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్ మ్యాచ్ ( Team India Vs Pakistan Match) ఆడకపోతే దాదాపు 4500 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వెలుబడుతున్నాయి. బ్రాడ్ కాస్టర్లు, ఐసీసీ ఇతర రంగాల వారికి ఈ నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ( Team India Vs Pakistan ) చూసే అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రపంచకప్ పైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.
Shoaib Akhtar takes on Pakistan Cricket Board 🗣️
"Boycotting the match against India in the T20 World Cup is not a good idea. India doesn't need Pakistan, but Pakistan needs India and ICC to run the PCB and manage expenses."
– What's your take 🤔 pic.twitter.com/Kcl4WOOVl5
— Richard Kettleborough (@RichKettle07) February 3, 2026