E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..
Advertisement

Podarillu Today Episode September 13th : శైలు చేసిన పని తెలిస్తే మీరు కూడా తనని కొడతారు అని కేశవ్ అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పురా ఎందుకు అమ్మాయిని భయపెడుతున్నావు అని నారాయణ అంటాడు. ఇది అన్నయ్య దగ్గరికి వెళ్లి మీరు తొందరగా పెళ్లి చేసుకోకపోతే మాకు పెళ్లి జరగదు అని చెప్పింది. దానివల్ల అన్నయ్య ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని అందరితో చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. తను పెళ్లి చేసుకుంటేనే మనం పెళ్లి చేసుకోవాలి అని నువ్వు కండిషన్ పెట్టావు కదా అందుకే నేను వెళ్లి అతనితో మాట్లాడాను. ఆయన ఈ పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడేంటి నీ బాధ అని శైలు అంటుంది కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. శైలు తన పెళ్లి కోసమేదంతా చేసింది కదా ఇంకా వదిలేయరా అని కేశవ్ అని కంట్రోల్ చేస్తారు.

చక్రీ మాస్టర్ ప్లాన్..

మనం ఎలాగైనా సరే అన్నయ్య జీవితం కాపాడాలి అంటే ఈ పెళ్లిని ఆపాలి ముందు ఎంగేజ్మెంట్ ని ఎలా ఆపాలు అది ఆలోచిద్దాము అని అందరూ అనుకుంటారు.. అయితే గుడ్డిగా వెళ్లి చక్రిని అందరూ నమ్ముతారు.. చక్రి మాధవ పెళ్లి ఆపాలి అంటే నేను చెప్పినట్టు మీరు చేయాలి అని అంటాడు.. ఆ మాట వినగానే చక్కెర ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక పెళ్లికూతురు తండ్రికి ఫోన్ చేసిన చక్రి మాధవ్ గురించి లేనిపోనివి కల్పించి చెప్పి పెళ్లి చెడగొట్టాలని అనుకుంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ అబద్ధాలు చెప్తే పెళ్లి ఆగిపోతుందా అని చక్రిని తిడతారు.. అయితే ఈ పెళ్లి ఎలాగైనా జరిగితే బాగుండు అని జయంతి వాళ్ళ తమ్ముడు కూడా అనుకుంటాడు. మరి చక్రి చెప్పిన మాటల్ని జయంతి వాళ్ళ నాన్న వెంటాడా?  పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడా..? అక్కడ తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

జయంతి మాటతో నాన్న షాక్..

Advertisement

జయంతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చక్రి చెప్పిన మాటల్ని అందరూ నిజమే అని అనుకుంటారు. చక్రి చెప్పిన విధంగానే ఆ అతను నమ్మితే బాగుంటుంది. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అని అందరూ అనుకుంటారు. అయితే ఈ విషయాన్ని వెంటనే జయంతితో చెప్పాలి అని వాళ్ళ నాన్న జయంతి దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయి చాలా చెడ్డవాడు అని అందరూ అంటున్నారు అని చెప్తాడు. అయితే జయంతి మాత్రం ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారు అతను ఒక అమాయకుడని నేను ఎంక్వైరీ చేశాను. కానీ ఎవరు ఫోన్ చేసి చెప్పిందాన్ని గురించి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు ఎంగేజ్మెంట్ ఎలాగైనా సరే జరగాల్సిందే అని జయంతి మొండిగా వాదిస్తుంది.. కానీ జయంతి ఎంత చెప్తున్నా సరే వాళ్ళ నాన్న మాత్రం నువ్వు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్తాడు..

పాత బావ పనేనా..?

శశి మీ పాత బావ ఎక్కడున్నాడు అని జయంతి అడుగుతుంది.. బయట ఉన్నాడు అక్క అందరికీ పెళ్లి గురించి చెప్తూ వస్తున్నాడు అని అనగానే.. జయంతి చూసావా నాన్న ఈ పెళ్లి చెడగొట్టడానికి తనే మీతో ఫోన్ చేయించి ఇలా మాట్లాడించి ఉంటాడు మీరు దాని గురించి ఏం భయపడకండి అని జయంతి అంటుంది. నాకెందుకో ఈ పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు అని అనిపిస్తుంది అని అతని ఎంత చెప్తున్నా సరే జయంతి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఈ పెళ్లి జరగాల్సిందే అని అంటారు. ఇకపోతే జయంతి తో పెళ్లి సంబంధం ఎలా చెడగొట్టాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ పెళ్లి సంబంధాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయించి మాధవ్ కి మంచి సంబంధాన్ని తీసుకురావాలి అని ఇంట్లోని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు.

రంగంలోకి తాయారు..

Advertisement

తాయారు తాపీగా కూర్చుని మైసూర్పాక్ తింటూ ఉండగా నారాయణ ఈ పెళ్లి ఆగిపోవడానికి నా చెల్లెలు తాయారు ఒకటి సరిపోతుంది అని మా అదిరిపోయే ప్లాన్ చేస్తాడు. మావియ్యపురానికి తాయారుకి గోడ పెట్టేస్తే చాలు కచ్చితంగా ఈ పెళ్లి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అని నారాయణ ప్లాన్ చేస్తాడు. తాయరు దగ్గరికి వెళ్లి నిన్ను మావియ్యపురాలు ఏమంటుందో తెలుసా భారీ సైజులో ఉన్నవని తిండికి తప్ప ఎందుకు పనికిరావని అంటుంది అని నాన్న మాటలు ఎక్కించి తాయారును రెచ్చగొడతాడు నారాయణ.. ఎవర్తి అది అనడానికి అది దాని సంగతి చూస్తాను అని అంటుంది. ఇక నారాయణ మాస్టర్ ప్లాన్ మాత్రం సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది ఎందుకు మా అమ్మని రెచ్చగొట్టి ఇప్పుడు గొడవకి పంపించారు ఎలా జరిగితే ఈ పెళ్లి ఆగిపోతుంది తెలుసా నీకు గాయత్రి అంటుంది. పెళ్లి ఆగిపోవాలని ఇదంతా చేసాము. దీని గురించి నువ్వేమీ బాధపడవద్దు అని గాయత్రి తో మహాలక్ష్మి అనగానే తను ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Related News

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

Big Stories

Advertisement
×