E-Paper
Advertisement

Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
Advertisement

Chandrababu Bail : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ స్కాం కేసు వ్యవహారంలో విచారణల పర్వం కొనసాగుతోంది. 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వేసిన పిటిష్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మధ్యంతర బెయిల్ పై వాదనలు ముగియగా.. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం రెగ్యులర్ బెయిల్ పై వాదనలు వింటామని తెలిపింది. దీంతో కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

క్వాష్‌ పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ ముగియగా.. నవంబర్ 8వ తేదీన తీర్పు వెల్లడించనుంది. కాగా.. మధ్యంతర బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ లోపు దసరా సెలవులకు ముందు బెయిల్ కోరుతూ చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. ఇది వాయిదా పడి వెకేషన్ బెంచ్‌కు వెళ్లినా..అక్కడి న్యాయమూర్తి నాట్ బిఫోర్ అంటూ అక్టోబర్ 30కి వాయిదా వేశారు.జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి.. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×