BigTV English

TTD – Asaduddin owaisi Issue : తిరుపతి.. మీ జాగీరా? – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసదుద్దీన్ ఫైర్

TTD – Asaduddin owaisi Issue : తిరుపతి.. మీ జాగీరా? – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసదుద్దీన్ ఫైర్

TTD – Asaduddin Owaisi Issue :


⦿ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసదుద్దీన్ ఫైర్
⦿ అన్యమతస్తులను ఉద్యోగం నుంచి తొలగిస్తామన్న నాయడు
⦿ బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై అసదుద్దీన్ మండిపాటు
⦿ తిరుపతిలో అన్యమతస్తులు ఉద్యోగం చేస్తే తప్పేంటి?
⦿ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకూ అవకాశం ఇవ్వాలన్న కేంద్రం
⦿ మాకో రూల్.. మీకో రూలా?
⦿ వక్ఫ్ బోర్డులలోనూ హిందువుల జోక్యం ఊరుకోం
⦿ ఇది లౌకిక రాజ్యం..మతాల పేరుతో విడదీస్తున్నారు

హైదరాబాద్, స్వేచ్ఛ : నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీటీడీ బోర్డ్ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో వివాదాస్పదంగా తయారయ్యాయి. పదవీ బాధ్యతలు చేపట్టగానే బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్తులను తొలగిస్తామని.. వారికి వీఆర్ఎస్ ఇచ్చి పంపుతామని బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇకపై హిందువులకు మాత్రమే తిరుమలలో ఉద్యోగావకాశాలు అని వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన ఉండబోతోందని.. అన్యమతస్తుల విషయంలో ఇకపై కఠినంగా ఉంటామని.. బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం తీవ్రంగా స్పందించారు.


హిందూ పక్షపాతిలా..

తిరుల బోర్డులో పనిచేసే 24 మంది సభ్యులలో అందరూ హిందువులే ఉండాలని బీఆర్ నాయుడు మరీ హిందూ పక్షపాతిగా మాట్లాడుతున్నారని.. ఇన్నాళ్లుగా లేని రూల్స్ ఇప్పుడెందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీ వెనక ఉండి ముస్లిం వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తోందని అన్నారు. చంద్రబాబు కూడా కూటమిలో భాగస్వామి కావడంతో బీజేపీ చెప్పినట్లు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తాను ఖండిస్తున్నానని అన్నారు. వక్ఫ్ బోర్డు కు సంబంధించిన నియామకాలలో హిందువులు కూడా ఉండాలని కేంద్రం బిల్లును రూపొందించిందని అన్నారు. వక్ఫ్ కౌన్సిల్ లోనూ హిందువులకు స్థానం కల్పిస్తూ కేంద్రం బిల్లులు రూపొందించిందని.. అలాంటప్పుడు అందరూ ముస్లిములే ఉండాలని మేము కూడా డిమాండ్ చేయవలసి వస్తుందని అన్నారు.

ఇది లౌకిక రాజ్యం

రూల్స్ మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి కుదరదన్నారు. ఇది లౌకిక రాజ్యం అని అన్ని మతాలనూ గౌరవించాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని..అందుకు అనుగుణంగానే నిర్ణయాలు కూడా ఏకపక్షంగా తీసుకొంటున్నారని విమర్శించారు. మాకు కూడా హిందూ సంప్రదాయాలంటే గౌరవం ఉందని అన్నారు. కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి ఏజెంట్ గా పనిచేస్తున్నారని..అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం కూడా పునరాలోచించాలని అన్నారు. జాతీయ స్థాయి మీడియాకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×