BigTV English
Advertisement

Mirai: ‘మిరాయ్’ నుండి క్రేజీ అప్డేట్.. తేజ సజ్జాతో స్టెప్పులేయడానికి సిద్ధమయిన ప్రభాస్ హీరోయిన్

Mirai: ‘మిరాయ్’ నుండి క్రేజీ అప్డేట్.. తేజ సజ్జాతో స్టెప్పులేయడానికి సిద్ధమయిన ప్రభాస్ హీరోయిన్

Mirai Movie: ఒక్క సినిమాతో ఎనలేని పాపులారిటీ, క్రేజ్, స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి హీరోల లిస్ట్‌లోకి తేజ సజ్జా (Teja Sajja) కూడా యాడ్ అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తర్వాత తేజ సజ్జాకు ‘హనుమాన్’తో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. దీంతో ఒక్కసారిగా తను కూడా ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. తనతో కూడా ప్యాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించవచ్చనే కాన్ఫిడెన్స్ మేకర్స్‌లో కలిగింది. అందుకే ‘హనుమాన్’ తర్వాత అంతకు మించిన భారీ బడ్జెట్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు తేజ. అదే ‘మిరాయ్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది.


ఫారిన్‌లో షూటింగ్

‘హనుమాన్’ విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ సాధించిన వెంటనే ఆ సందర్భాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ‘మిరాయ్’ను అనౌన్స్ చేశాడు తేజ సజ్జా. అనౌన్స్ చేయడం మాత్రమే కాదు.. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా విడుదల చేశాడు. ‘హనుమాన్’లాగానే ‘మిరాయ్’ (Mirai) కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కుతోందని గ్లింప్స్‌తోనే తెలిసేలా చేశారు. దీంతో అప్పుడే ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దాదాపుగా ‘మిరాయ్’ షూటింగ్ అంతా వేరే దేశాల్లోనే జరుగుతుందని మేకర్స్ ముందుగానే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ నుండి మరొక అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.


Also Read: ఆ రెండు సినిమాటిక్ యూనివర్స్‌లలో ప్రభాస్.. యంగ్ డైరెక్టర్స్‌ను బ్లైండ్‌గా నమ్ముతున్న పాన్ ఇండియా స్టార్

మామూలు విషయం కాదు

‘మిరాయ్’ సినిమాలో తేజ సజ్జా సరసన నటించడం కోసం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ నటించనుంది. ఈ విషయాన్ని గ్లింప్స్‌లోనే స్పష్టం చేశారు మేకర్స్. ఇంతలోనే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ప్రభాస్ హీరోయిన్, ‘రాజా సాబ్’ బ్యూటీ నిధి అగర్వాల్‌ను రంగంలోకి దించనున్నారనే వార్త బయటికొచ్చింది. దాదాపుగా ఈ వార్త కన్ఫర్మ్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఫేమ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ ‘రాజా సాబ్’తో బిజీగా ఉంది. ఇదే సమయంలో ‘మిరాయ్’తో తేజ సజ్జాతో స్టెప్పులేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

అన్ని భాషల్లో విడుదల

‘మిరాయ్’ సినిమాలో మరొక హైలెట్‌గా నిలిచే అంశం మంచు మనోజ్. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయిన మంచు మనోజ్.. ‘మిరాయ్’లో విలన్‌గా కనిపిస్తూ రీఎంట్రీకి సిద్ధపడ్డాడు. ఇప్పటికే తన క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్ కూడా బయటికొచ్చింది. అలా ఇప్పటివరకు ‘మిరాయ్’ నుండి బయటికొచ్చిన ప్రతీ అప్డేట్.. ప్రేక్షకుల్లో హైప్‌ను విపరీతంగా పెంచేసింది. టీజీ విశ్వప్రసాద్.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో కూడా ‘మిరాయ్’ విడుదల కానుంది. 2025 ఏప్రిల్ 18న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×