BigTV English

Dalit Women: దళిత మహిళపై పాశవికం.. స్తంభానికి కట్టేసి..

Dalit Women: దళిత మహిళపై పాశవికం.. స్తంభానికి కట్టేసి..

Attack on Dalit Women: మనిషి అంతరిక్షానికి కూడా అవలీలగా చేరుకునే రోజులు వచ్చాయి. కానీ కుల జాడ్యాన్ని విడనాడే రోజులు మాత్రం రావటం లేదు. నేటి ఆధునిక యుగంలోనూ కుల వివక్షకు సంబంధించిన ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దారుణం చోటు చేసుకుంది. దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టారు చాకలి సామాజికవర్గంవారు.


కల్లుకుంటలో ఆరు నెలల క్రితం ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వరుడు దళిత సామాజికవర్గానికి చెందిన యువకుడు కాగా.. వదువు చాకలి సామాజికవర్గానికి చెందిన యువతి. కులాంతర వివాహాన్ని ఆమోదించని గ్రామ పెద్దలు వరుడి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు.

Also Read: టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్.. కాకపోతే..


అయితే తాజాగా.. వరుడి తల్లి గోవిందమ్మ పని మీద కల్లుకుంట్ల గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో గ్రామంలోని వధువు బంధువులు గోవిందమ్మ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై చేయి చేసుకున్నారు. దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టారు చాకలి సామాజికవర్గంవారు. ఈ క్రమంలో దళిత, చాకలి సామాజికవర్గాల మధ్య తీవ్ర దాడులు, ప్రతి దాడులు జరిగాయి. కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×