BigTV English

Ysrcp leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్.. కాకపోతే..

Ysrcp leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్.. కాకపోతే..

Ysrcp leaders: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు చిన్న ఊరట లభించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్‌లకు మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు, 48 గంటల్లో పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది.


టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఐదుగురు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నుంచి ఆయా నేతలు అందుబాటులో లేరు. నేతల పిటిషన్లను విజయవాడ న్యాయస్థానం, హైకోర్టు రిజెక్ట్ చేసింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాకపోతే అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పిస్తూనే పలు షరతులు విధించింది.

ALSO READ: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!


ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విచారించే పనిలోపడ్డారు. ఈ క్రమంలో దేవినేని అవినాశ్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఇందులోభాగంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు.  వైసీపీ నేతల తరపున కపిల్ సిబల్, అల్లంకి రమేష్.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్‌ లుత్రా  న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించారు.

ఇరువర్గాల వాదనలు విన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం..  పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది. అంతేకాదు కేసు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. మూడువారాల వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ నాలుగుకు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్‌పై అదే రోజు తేల్చనుంది న్యాయస్థానం.

2021 అక్టోబరు 19న దాదాపు 200 మంది టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ఆ ఘటనలో ఆఫీసుకి సంబంధించిన ఫర్మీచర్ డ్యామేజ్ అయ్యింది. వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేసినప్పటి కీ ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసుపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×