BigTV English
Advertisement

Ayyanna case : అయ్యన్నపై సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Ayyanna case : అయ్యన్నపై సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Ayyanna case: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై సీఐడీ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నకిలీ ఎన్‌ఓసీ సమర్పించి 0.16 సెంట్ల జలవనరుల శాఖ భూమిని కబ్జా చేశారని అయ్యన్నపాత్రుడిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన భూఆక్రమణ కేసును కొట్టివేయాలని సవాల్‌ చేస్తూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.


అయ్యన్నపై కావాలనే సెక్షన్ 467 నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. అసలు ఈ కేసులో సెక్షన్‌ 467 చెల్లదని వాదనలు వినిపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అయ్యన్న సంతకం ఫోర్జరీ చేశారని సీఐడీ తరఫున న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను భయపెట్టి బెదిరించారని అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించి అయ్యన్నపై నమోదైన కేసులో సెక్షన్ 467 వర్తించదని స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.


Tags

Related News

Pawan Kalyan: రోడ్లపై నిర్లక్ష్యం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్!

Jagan Tour: అప్పుడు పరదాల్లో, ఇప్పుడు పొలాల్లో.. ఏంటి జగన్ ఇది!

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..

YS Jaganmohan Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

Papikondalu Tour: పాపికొండల బోటు షికారు షురూ.. ప్యాకేజీ వివరాలు ఇదిగో

Ysrcp Politics: ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు, ఈసారెక్కడ?

YS Jagan: వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశ్రుతి..

Srikakulam News: ఛీ.. ఛీ.. అసలు మనిషేనా.. విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న టీచర్..

Big Stories

×