HIT 2 Teaser: హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా విజయం తర్వాత దానికి ఫ్రాంచైజీగా రూపొందుతోన్న చిత్రం హిట్ 2 ది సెకండ్ కేస్. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. రీసెంట్‌గానే మూవీ టీజర్ రిలీజైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 9 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. అంతా బావుందని అనుకుంటున్న సమయంలో యూ ట్యూబ్ హిట్ 2 టీమ్‌కి షాకిచ్చింది. టీజర్‌ను ట్రెండింగ్ నుంచి తొలగించింది. వయొలెన్స్ ఎక్కువగా చూపించిన కారణంగా టీజర్‌ను చూడాలనుకునే వారి కోసం ఏజ్ రిస్ట్రిక్షన్‌ని పెట్టింది.
అయితే హిట్ 2 టీజర్‌పై ఏజ్ రిస్ట్రిక్షన్ ఆంక్షలు పెట్టిన యూ ట్యూబ్ చర్యలను టీమ్ తప్పు పట్టలేదు. పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యింది. హీరో అడివి శేష్ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో తాము ఇలాంటి రిజల్ట్‌ను ముందే ఊహించిందని అన్నారు. అయితే 18 ఏళ్లు పైబడిన వారు యూ ట్యూబ్‌లో సైన్ అయితేనే టీజర్‌ను చూడటానికి కుదురుతుందని కూడా శేష్ తెలిపారు.
శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్.