BigTV English

Bala Shouri | మచిలీపట్నంలో వైసీపీకి షాక్.. జనసేనలోకి ఎంపీ బాలశారి!

Bala Shouri | వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను హైదరాబాద్‌లోని నివాసంలో బాలశౌరి వెళ్లి కలిశారు. వారి భేటీలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

Bala Shouri | మచిలీపట్నంలో వైసీపీకి షాక్.. జనసేనలోకి ఎంపీ బాలశారి!

Bala Shouri | వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను హైదరాబాద్‌లోని నివాసంలో బాలశౌరి వెళ్లి కలిశారు. వారి భేటీలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలశౌరి కూడా తను చేరబోయే పార్టీపై స్పష్టత ఇచ్చారు. మంచి ముహూర్తం చూసుకుని త్వరలోనే జనసేనలో చేరతానని ఎంపీ బాలశౌరి ప్రకటించారు. చేరతారు సరే.. మరి ఈసారి ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?


ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీకి జై కొట్టారు .. త్వరలోనే పార్టీలో చేరతానని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సమున్నత ఆశయాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన ఆకాంక్ష నచ్చి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలోనే జనసేన కండువా కప్పుకోవడానికి ముహూరం వెతుక్కుంటున్నారు.

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన బాలశౌరి సడన్‌గా రాజీనామా చేయడానికి పార్టీలో సముచిత గౌరవం లభించకపోవడమే కారణమంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. ఇలా రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారని .. అందుకే బాలశౌరిని పొమ్మనలేక హైకమాండ్ పొగబెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రిపేర్ని నానికి, బాలశౌరికి మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది.. దాంతో ఇక అక్కడ ఇమడలేక ఆయన రిజైన్ చేశారు.


పవన్‌కళ్యాణ్‌ని కలిసాక కృష్ణాజిల్లాకు వచ్చిన బాలశౌరికి జిల్లా జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు భారీగా తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. వారితో పాటు టీడీపీ నేతలు కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఏపీలోని రాజకీయ పరిస్థితులపై చర్చించాని బాలశౌరి వారితో చెప్పుకొచ్చారు. పవన్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలున్న నాయకుడని అర్థమైందని.. పోలవరం ప్రాజెక్టును ఎంత త్వరగా పూర్తిచేస్తే రైతులకు అంత ప్రయోజనం కలుగుతుందని ఆయన తనతో చెప్పారన్నారు.

Bala Shouri, exit, YSRCP, join, Janasena, Machilipatnam politics, MP Bala shouri, Andhra Pradesh news,

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×