BigTV English

IPL 2024 : ఐపీఎల్ షెడ్యూల్.. అన్నిటికీ ఎఫెక్ట్ ?

IPL 2024 : ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ తేదీలు చాలా ఇబ్బందికరంగా పరిణమించాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ను ప్రారంభించాలని, మే 26న ఫైనల్ మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్, మేనెలల్లో జరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఐపీఎల్ కి ఇబ్బందికరమని అంటున్నారు. అలాగైతే వాయిదా వేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఐపీఎల్ షెడ్యూల్ కి ఇబ్బంది లేకుండా ముందే జరిగితే, మరో ముప్పు పొంచి ఉంది.

 ఈ మధ్యలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను ఫిబ్రవరి 22 నుండి మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లన్నీ బెంగళూరు, ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. వీటి తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. అక్కడ ఎన్నికల డేట్స్ వచ్చి, ముందుకు జరిగితే, వీటికి ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ సజావుగా సాగినా మరో భయంకరమైన ముప్పు పొంచి ఉంది.

అదేమిటంటే జూన్ 1 నుంచి టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అన్ని దేశాల నుంచి ప్రముఖ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడుతున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అది ఆడి, విదేశీ ఆటగాళ్లు పెట్టేబేడా సర్దుకుని విమానాలెక్కి ఉరుకులు, పరుగులు పెట్టి వెళ్లాలంటే కష్టమేనని అంటున్నారు.

ఎందుకంటే వారికి రెస్ట్ ఉండాలి. అంతేకాదు ఫ్యామిలీని కూడా మిస్ అవుతారు కాబట్టి, ఇళ్లకు వెళ్లి రావల్సి ఉంటుంది. లేదంటే టీ 20 వరల్డ్ కప్ లో అలసిపోయి, మనసుపెట్టి ఆడలేరనే విమర్శలు వస్తున్నాయి. వీటినిగానీ ఆ దేశ క్రికెట్ బోర్డులు పరిగణలోకి తీసుకుంటే, వారిని ఐపీఎల్ కి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అలా జరిగితే ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ ఇబ్బందికరమని బీసీసీఐ ఆందోళన చెందుతోంది.

66 రోజుల పాటు సాగే ఐపీఎల్ షెడ్యూల్ గురించే బీసీసీఐ కంగారు పడుతోంది. కోట్ల రూపాయల పెట్టుబడిగా సాగే మ్యాచ్ ల విషయంలో ఉదాసీనత పనికిరాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకని వీళ్లు ఒక షెడ్యూల్‌ను ఖరారు చేసినప్పటికీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతనే ఐపీఎల్ గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. లేదంటే టీ 20 ప్రపంచ కప్ అయిన తర్వాత ఐపీఎల్ నిర్వహించినా ఆశ్చర్యం పోనవసరం లేదని అంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×