BigTV English

Nandikotkur YSRCP Politics | నందికొట్కూరులో వైసీపీ ఇన్చార్జి మార్పు.. మండిపడుతున్న దళిత నేతలు!

Nandikotkur YSRCP Politics | ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జిని మార్చేసింది వైసీపీ. ఎమ్మెల్యే అర్థర్ స్థానంలో దారా సుధీర్‌ని ప్రకటించింది. ఆ మార్పుతో స్థానిక దళిత నేతలు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. సెగ్మెంట్‌లోని రెడ్డి సామాజిక వర్గంలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

Nandikotkur YSRCP Politics | నందికొట్కూరులో వైసీపీ ఇన్చార్జి మార్పు.. మండిపడుతున్న దళిత నేతలు!

Nandikotkur YSRCP Politics | ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జిని మార్చేసింది వైసీపీ. ఎమ్మెల్యే అర్థర్ స్థానంలో దారా సుధీర్‌ని ప్రకటించింది. ఆ మార్పుతో స్థానిక దళిత నేతలు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. సెగ్మెంట్‌లోని రెడ్డి సామాజిక వర్గంలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నిర్వహించిన సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనుకూలంగా నివేదికలు వెలువడ్డాయి. అయితే బైరెడ్రి సిద్ధార్థరెడ్డి ప్రోద్బలంతో.. టికెట్ నిరాకరించడాన్ని అర్థర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తన అభిమానులతో కర్నూలు నగరంలో భారీ సమావేశం నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గ జనరల్‌గా ఉన్నప్పుడు ఎన్నికల్లో విజయం కోసం సినిమా తరహాలో ఫ్యాక్షన్ మర్డర్లు జరిగాయి అటువంటి నియోజకవర్గం 2009 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వు అయింది. దీంతో నియోజకవర్గం లో ఎటువంటి ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఎస్సీ రిజర్వ్‌డ్ మారినప్పటి నుంచి అక్కడి ఓటర్లు టీడీపీకి చాన్స్ ఇవ్వలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే అర్థర్‌ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన్నికాదని వైసీపీ అధిష్టానం దారా సుధీర్ పేరును ఇన్చార్జిగా ప్రకటించింది.

సుధీర్ నందికొట్కూరు నియోజకర్గానికి పూర్తిగా కొత్త. ఆయన వైజాగ్ నివాసి.. అయితే కడప జిల్లా మహిళను పెళ్లి చేసుకుని కడప జిల్లాలో వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. కడప జిల్లాలో ఏర్పడిన పరిచయాలతోబైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆయన పేరు సూచించి అభ్యర్ధిత్వం ఖరారు చేయించారంటున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన ప్రాబల్యం కోసం ఎక్కడో ఉన్న సుధీర్‌ను తమ సెగ్మెంట్‌కి తీసుకురావడంతో.. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


వాస్తవానికి ఎమ్మెల్యే అర్థర్ విషయంలో సర్వే ఫలితాలు అనుకూలంగానే వచ్చాయంట.. అయితే బైరెడ్డి చక్రం తిప్పి ఆయనకు టికెట్ లేకుండా చేశారని నందికొట్కూరు ఎస్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధినాయకత్వం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో ఆదరణ ఉన్న నేపధ్యంలో .. డాక్టర్ సుధీర్‌తో కలిసి డాక్టర్ ప్రజల్లోకి వెళ్లి ఎలా ఓట్లు అడగాలని మధనపడిపోతున్నారు.

ఆ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది దళిత నేతలు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని .. అయితే జగన్‌తో సన్నిహితంగా ఉండే బైరెడ్డి సిద్దార్థ పెత్తనమే నియోజకవర్గంలో నడుస్తోందని ఆరోపిస్తున్నారు. పేరుకి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైనా పెత్తనం మాత్రం రెడ్డి వర్గీయులదే ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట కాదన్న వారికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఉండదని .. అర్థర్ ఎపిసోడ్‌తో మరోసారి స్పష్టమైందన్న టాక్ వినిపిస్తోంది.

దానికి తగ్గట్లే ఎమ్మెల్యే ఆర్థర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐప్యాక్‌ సర్వేలో రాష్ట్రంలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా వచ్చిందని.. కానీ ఎందుకో తనకు టికెట్‌ దక్కలేదన్నారు. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇంఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందని .. ఈ సారి కూడా నందికొట్కూరు టికెట్‌ ఇస్తాం కానీ.. పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని పార్టీ పెద్దలు తనతో చెప్పారని అర్థర్ పేర్కొంటున్నారు. తాను ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కావాలనన్నారని .. మిగిలిన వ్యవహారాలను వేరే గ్రూప్‌ చూసుకుంటుందని వారు చెప్పారంటున్నారు.

వారి ప్రపోజల్ విని తాను షాక్ అయ్యానంటున్న అర్థర్ నియోజకవర్గంలో పాలన వేరే వారికి అప్పగించడానికి తాను చదువురానివాడినా అని ప్రశ్నిస్తున్నారు.. ఇక ఇప్పుడాయన తన భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో మీటింగులు మొదలు పెట్టారు. నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఎక్కువమంది అనుచరులు పార్టీ మారాలని సూచిస్తున్నారని .. అతి త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తానంటున్నారు. మరి ఆయన అడుగులు ఎటు పడతాయో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×