E-Paper
Advertisement

Bandla Ganesh: చంద్రబాబు కోసం.. షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర

Bandla Ganesh: చంద్రబాబు కోసం.. షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర
Advertisement

Bandla Ganesh: ఎట్టకేలకు తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు నిర్మాత బండ్ల గణేశ్. సోమవారం ఉదయం షాద్‌నగర్‌లో తన ఇంటి నుంచి తిరుమలకు బయలుదేరారు. ఇది రాజకీయ యాత్ర కాదని, మొక్కుబడి చెల్లింపు కోసం మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘బిగ్ టీవీ’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు.

నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర మొదలు

Advertisement

నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల‌ గణేష్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఏదైనా ముక్కుసాటిగా మాట్లాడే తత్వం ఆయన సొంతం. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోరు. నిర్మాత అయినా కొందరు నాయకులంటే ఆయన విపరీతమైన అభిమానం. అందుకోసం ఆయన ఏమైనా చేస్తుంటారు కూడా.

ఓ కేసులో వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబుని అరెస్టు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు అభిమానులు బాధపడ్డారు. అలాంటివారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఈ కేసులో జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే తిరుమలకు నడిచి వస్తానని వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. ఇప్పుడు ఆ మొక్కును తీర్చే పనిలో‌పడ్డారు.

Advertisement

షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు

ఈ క్రమంలో సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి ఆయన తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ‘బిగ్ టీవీ’ ఆయన్ని పలకరించింది. చంద్రబాబు అరెస్టు సమయంలో తాను మొక్కుకున్న మొక్కని అది తీర్చుకునేందుకు బయలు దేరినట్టు చెప్పారు. కేవలం సంకల్పయాత్ర మాత్రమేనని, 20 రోజుల్లో తిరుమలకు పాదయాత్ర పూర్తి చేస్తానని చెప్పకనే చెప్పారు.

దేశంలో అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు గణేష్. చంద్రబాబు బెయిల్ విషయంలో రెండుసార్లు తాను సుప్రీంకోర్టుకు హాజరైనట్టు వివరించారు. ఈ కేసు తాను విచారించలేనని న్యాయమూర్తి చెప్పడంతో న్యాయస్థానం నుంచి బయటకు వచ్చానన్నారు. ఆ సమయంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నానని తెలిపారు.

ALSO READ:  ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు

తన ఇంటి నుంచి తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కుకున్నట్లు తెలియజేశారు. తాను మొక్కిన నాలుగు రోజులకు అభిమాన నేతకు బెయిల్‌ వచ్చిందన్నారు. గతవారం  ఆ కేసుని న్యాయస్థానం పూర్తిగా కొట్టి వేసిందన్నారు. కేసు క్లోజ్ అయినా మొక్కు ఆపడం తప్పని భావించి పాదయాత్ర మొదలు పెట్టినట్టు మనసులోని మాట బయటపెట్టారు.

20 రోజుల్లో తిరుమలకు పాదయాత్ర పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కేవలం దైవకార్యక్రమం మాత్రమేనని తెలిపారు. దీనికి సంకల్పయాత్ర అని ఆయన నామకరణం చేసుకున్నారు.  మూడువారాల తర్వాత బండ్ల గణేష్ తిరుమలకు చేరుకోనున్నారు.

 

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×