BigTV English

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Bhumana Karunakar Reddy: తిరుమల లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. అప్పట్లో నెయ్యికి బదులుగా జంతువుల నూనెతో ప్రసాదం తయారు చేయించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు యావత్ దేశమంతా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల్ని భూమన తప్పు పట్టారు. సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.


అధికారం చేతిలో పెట్టుకుని సరైన ఎంక్వరీ వేయకుండా ఇలాంటి నిందలు మోపటం ద్వారా వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని.. శకుని కూడా బాబు చేష్టలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారంటూ భూమన ఫైర్ అయ్యారు. జగన్‌ పార్టీని లేకుండా చేయటం కోసం.. హిందువులు పవిత్రంగా భావించే లడ్డూపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

నందిని కంపెనీ నెయ్యి ఎందుకు వాడటం లేదని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, లోకేష్.. నాడు టీడీపీ హయాంలో ఎందుకు వాడలేదో చెప్పాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం ఆరు నెలలు మాత్రమే నందిని నెయ్యి వాడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.


నిపుణులు ల్యాబ్‌ టెస్టులు జరిపించాక నెయ్యిని.. TTD వాడుతుందనే విషయం తెలియకుండానే ఆరోపణలు చేశారా అంటూ భూమన.. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. క్వాలిటీ ఏ మాత్రం తగ్గినా.. ఆ నెయ్యిని తిరస్కరిస్తారన్న విషయం తెలిసి.. తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేస్తున్నారని భూమన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీటీడీ ఈఓ శ్యామలరావు కలిశారు. జనసేన క్యాంపు కార్యాలయంలో ఇద్దరు భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ వివాదంపై చర్చించారు. గత పాలక మండలి హయాంలో శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందని పవన్ దృష్టికి తిరుమలరావు తీసుకొని వెళ్లారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయాన్ని తెలిపారు. ఆ నెయ్యి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? అందులో ఎంత మొత్తం కల్తీ అయిందనే వివరాలు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇక.. శ్రీవారి లడ్డూ కల్తీ కావడంతో పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఈ వివాదంపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. నాడు టీటీడీ సభ్యుడిగా పర్చేజింగ్ కమిటీలో పార్థసారథి సభ్యుడిని భూమన చెప్పగా.. నాటి జేఈవోకి తెలీకుండా ఈగ కూడా వాలేది కాదన్నారు మంత్రి. ప్రతి నిర్ణయం అప్పటి సీఎం.. ఆయన బాబాయ్ తీసుకునేవారని కౌంటరిచ్చారు.

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి శ్రీవారిని క్షమాపణలు కోరారు ప్రధాన అర్చకులు రంగరాజన్. కల్తీ నెయ్యితో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×