BigTV English

Eluru Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఏలూరును ఏలబోయేది ఎవరు?

Eluru Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఏలూరును ఏలబోయేది ఎవరు?
Andhra news today

Eluru Assembly Constituency(Andhra news today): ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో ఏలూరు ముఖ్యమైంది. ఇక్కడ 2009 నుంచి కాపు సామాజికవర్గం నేతలే గెలుస్తూ వస్తున్నారు. ఆళ్లనాని ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో నాని కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో బడేటి కోట రామారావు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా ఏలూరు రాజకీయాలు చాలా వరకు మారిపోయాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

ఆళ్ల నాని VS బడేటి కోట రామారావు


2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని 45 శాతం ఓట్లు సాధించి గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బడేటి కోట రామారావుకు 42 శాతం ఓట్లు వచ్చాయి. ఇక జనసేన నుంచి పోటీ చేసిన అప్పల నాయుడు రెడ్డికి 10 శాతం ఓట్లు వచ్చాయి. ఏలూరులో కాపు సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. దీంతో ఈ వర్గం ఓటర్లు కీలకంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇదే సామాజికవర్గం నేతలను అన్ని పార్టీలు బరిలో నిలుపుతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవబోతోంది. మరి ఈసారి ఎన్నికల్లో ఏలూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆళ్ల నాని (YCP) ప్లస్ పాయింట్స్

  • ఏలూరు టౌన్ లో రోడ్ల విస్తరణతో జనానికి రిలీఫ్
  • గ్రామాల్లో కొత్త సీసీ రోడ్లు వేయడం
  • ఆళ్లనాని పట్ల వైసీపీ క్యాడర్ లో సంతృప్తి
  • ఇళ్ల పట్టాలు అందించడం
  • గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉండడం

ఆళ్ల నాని మైనస్ పాయింట్స్

  • హామీ ఇచ్చినట్లుగా లిక్కర్ నిషేధం చేయకపోవడం
  • నాసిరకమైన లిక్కర్ అమ్మకాలపై అసంతృప్తి
  • 2019లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించకపోవడం
  • అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురాలేకపోవడం
  • గార్బేజ్ ట్యాక్స్ పై జనంలో ఆగ్రహం
  • జనానికి అంతగా అందుబాటులో ఉండరన్న అభిప్రాయం
  • మంచి పొజిషన్ లో ఉన్నా ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం

బడేటి రాధాకృష్ణ (TDP) ప్లస్ పాయింట్స్

  • కాపు సంక్షేమ సంఘం మద్దతుపై ఆశలు
  • సోదరుడి మృతితో సానుభూతి ఓట్లు వచ్చే ఛాన్స్
  • ఇంటింటి ప్రచారం చేస్తుండడం
  • క్యాడర్ తో కలిసి సంకల్ప యాత్ర చేయడం

బడేటి రాధాకృష్ణ మైనస్ పాయింట్స్

  • తగినంత రాజకీయ అనుభవం లేకపోవడం
  • ఆళ్లనానిని ఏమేరకు ఢీకొంటారన్న డౌట్లు

అప్పలనాయుడు రెడ్డి (JSP) ప్లస్ పాయింట్స్

  • గత ఎన్నికల్లో మంచి ఓట్ షేర్ రాబట్టడం
  • ట్రేడ్ యూనియన్ లీడర్ గా జనంలో గుర్తింపు
  • ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతారని జనంలో అభిప్రాయం

అప్పలనాయుడు రెడ్డి మైనస్ పాయింట్స్

  • టీడీపీతో పొత్తులో భాగంగా టిక్కెట్ రావడంపై డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

Read More: Alur Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఆలూరు పోల్ సీన్‌లో ఎవరి హవా ఎంత? 

ఆళ్లనాని VS బడేటి రాధాకృష్ణ

ఇప్పటికిప్పుడు ఏలూరు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాధాకృష్ణ బరిలో దిగితే ఆయనకు 51 శాతం ఓట్లు, అలాగే వైసీపీ అభ్యర్థి ఆళ్లనానికి 42 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఏలూరులో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, టీడీపీ, జనసేన పొత్తు ఎఫెక్ట్ తో ఆ ఓట్లన్నీ రాధాకృష్ణవైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ, జనసేన నుంచి రేసులో ఉన్న ఇద్దరు నేతలు కూడా క్లీన్ ఇమేజ్ ఉండడం మరో కలిసి వచ్చే అంశం. అప్పలనాయుడికి టిక్కెట్ రాకపోతే.. టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణకు సపోర్ట్ చేస్తానని ప్రకటించడం కూడా కూటమికి విజయానికి మరింత ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్ ప్రభుత్వం కనిపిస్తున్న సహజ వ్యతిరేకత కూడా ఈ కూటమికి ఏలూరులో సానుకూలాంశంగా మారింది. అటు వైసీపీ ఓట్ షేర్ కు సంక్షేమ పథకాల లబ్దిదారుల అండ కలిసి వస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×