BigTV English

Alur Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఆలూరు పోల్ సీన్‌లో ఎవరి హవా ఎంత..? 

Alur Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఆలూరు పోల్ సీన్‌లో ఎవరి హవా ఎంత..? 
Latest political news in Andhra Pradesh

Alur Assembly constituency Survey: ఏపీలోని మరో కీలక నియోజకవర్గం ఆలూరు. ఈ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. 2009 వరకు ఆలూరులో హస్తం పార్టీదే హవా. ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే గెలుపు కాంగ్రెస్ దే అన్నట్లుగా ఇక్కడి ఓటరు తీర్పు ఇచ్చే వారు. అందుకే ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ గతంలో 9 సార్లు విజయం సాధించింది. మరోవైపు ఈ సెగ్మెంట్ లో కోట్ల సుజాతమ్మకు కూడా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆమె మామ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పని చేశారు. అలాగే సుజాతమ్మ భర్త కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా పని చేశారు. గతంలో మన్మోహన్ హయాంలో రైల్వేశాఖ సహాయమంత్రిగానూ పని చేశారు. అయితే ఈ పెద్ద నేతలను ఢీకొట్టేందుకు వైసీపీ భారీ వ్యూహాలతోనే పని చేస్తోంది. ఆలూర్ సెగ్మెంట్ లో 26 శాతంగా ఉన్న బలమైన బోయ కమ్యూనిటీకి చెందిన నాయకులనే పోటీకి దింపుతోంది. గతంలో రెండుసార్లు గెలిచిన జయరాం, అలాగే ఇప్పుడు సెగ్మెంట్ వైసీపీ ఇంఛార్జ్ గా నియమితులైన బూసిని విరూపాక్షి కూడా బోయ కమ్యూనిటీకి చెందిన వారే. జయరాంపై సెగ్మెంట్ లో వచ్చిన ఆరోపణలు, పార్టీ చేసిన సర్వేల్లో గ్రాఫ్ తగ్గిందన్న కారణాలతో ఆయన్ను తప్పించి విరూపాక్షికి ఇంఛార్జ్ బాధ్యతలను జగన్ కట్టబెట్టారన్న టాక్ ఉంది. మరి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

గుమ్మనూరు జయరాం (వైసీపీ గెలుపు) VS కోట్ల సుజాతమ్మ


2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం 57 శాతం ఓట్లు రాబట్టి గెలిచారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ వేవ్, వైసీపీ హవా రెండోసారి ఈయన గెలుపునకు దోహదం చేసింది. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల సుజాతమ్మకు 36 శాతం ఓట్లు వచ్చాయి. ఇక జనసేన నుంచి పోటీ చేసిన వెంకటప్ప 2 శాతం ఓట్లు రాబట్టారు. మరి ఈసారి ఎన్నికల్లో ఆలూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Read More: Pileru Assembly Constituency: పీలేరులో టీడీపీ కల నెరవేరబోతుందా..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?

బూసిని విరూపాక్షి (YCP) ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో విరూపాక్షికి క్లీన్ ఇమేజ్ ఉండడం
  • వ్యతిరేకతను అధిగమిస్తారన్న అంచనాలు
  • జెడ్పీటీసీగా ఉన్నప్పుడు సొంత నిధులతో అభివృద్ధి పనులు
  • బోయ కమ్యూనిటీ ఓట్లు గుంపగుత్తగా వస్తాయని అంచనాలు
  • ఆలూర్ లో వైసీపీ క్యాడర్ సపోర్ట్ విరూపాక్షికి ఉండడం
  • సెగ్మెంట్ లో యాక్టివ్ గా ప్రచారాలు

బూసిని విరూపాక్షి మైనస్ పాయింట్స్

  • సెగ్మెంట్ లోని గ్రామాల్లో తాగునీటి సమస్య
  • సాగునీరు కూడా రాక రైతులకు ఇబ్బందులు
  • నత్తనడకన వేదావతి రిజర్వాయర్ పనులు
  • నత్తనడకన తుంగభద్ర లో లెవెల్ కెనాల్ పనులు జరుగుతుండడం
  • ఉపాధి అవకాశాలు లేక యువతలో అసంతృప్తి
  • సెగ్మెంట్ లో సరైన డ్రైనేజ్, రోడ్లు లేక అవస్థలు
  • ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం
  • కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా రాకపోవడం

కోట్ల సుజాతమ్మ (TDP) ప్లస్ పాయింట్స్

  • సుజాతమ్మకు బలమైన రాజకీయ వారసత్వం
  • 2004లో డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుజాతమ్మ
  • 2014, 2019 ఎన్నికల్లో ఓడిన సానుభూతి
  • ఆలూరు సెగ్మెంట్ లో అందరికీ తెలిసిన నేత
  • గత రెండు ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం
  • చాలా కమ్యూనిటీల్లో మంచి ఇమేజ్
  • గత ఐదేళ్లుగా టీడీపీ క్యాడర్ కు అండగా ఉండడం
  • నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం
  • సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకత విధానాలపై పోరాటం
  • ఇటీవలే అంగన్వాడీలకు మద్దుతగా ధర్నాలో పాల్గొనడం
  • టీడీపీ 6 గ్యారెంటీలను జనంలోకి తీసుకెళ్లడం
  • రా కదలిరా, జయహో బీసీ సహా పార్టీ కార్యక్రమాల నిర్వహణ
  • జనసేన నుంచి పోటీ లేకపోవడం, వారి సపోర్ట్ టీడీపీకే ఉండడం

ఇక వచ్చే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

బూసిని విరూపాక్షి VS కోట్ల సుజాతమ్మ

ఇప్పటికిప్పుడు ఆలూరులో ఎన్నికలు జరిగితే టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే కోట్ల సుజాతమ్మకు 51 శాతం ఓట్లు, అలాగే వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న బూసిని విరూపాక్షికి 46 శాతం ఓట్లు, ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత , గత రెండు ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మ ఓడిపోవడం, కోట్ల కుటుంబానికి ఉన్న ఇమేజ్, కోట్ల సుజాతమ్మకు వ్యక్తిగతంగా జనంలో ఉన్న మంచిపేరు, 2009 నుంచి ఇక్కడ టీడీపీ గెలవకపోవడం ఇవన్నీ గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్న చర్చ జనంలో జరుగుతుండడంతో గెలిచే పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఆలూరు సెగ్మెంట్ జనం మూడ్ కనిపిస్తోంది. వైసీపీ ఓట్ షేర్ కు కారణం అభ్యర్థి బూసిని విరూపాక్షికు సెగ్మెంట్ లో మంచి పేరు ఉండడం, బోయ వాల్మీకి కమ్యూనిటీ ఓట్లు వస్తాయన్న అంచనాలున్నాయి. విరూపాక్షి తన సొంత నిధులతో పనులు చేపట్టడం కూడా జనంలో పాజిటివ్ ఇమేజ్ ను పెంచుతున్నట్లు సర్వేలో తేలింది. అదే సమయంలో వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×