Ramachandrapuram Assembly Constituency: రామచంద్రాపురం రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. టిక్కెట్ వేటలో రెండు పార్టీల నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే టీడీపీ, వైసీపీల నుంచి యాక్టివ్‌గా ఉన్న వారివైపే అధినాయకత్వాలు చూస్తున్నాయి. ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక నేత. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేశారాయన. ఇండిపెండెంట్‌గా, కాంగ్రెస్ నుంచి గెలిచిన చరిత్ర ఉంది. ఈసారి మాత్రం ఆయన కొడుకు పిల్లి సూర్యప్రకాశ్‌కు వైసీపీ టిక్కెట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి రామచంద్రాపురం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.
2019 RESULTS
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (గెలుపు) VS తోట త్రిమూర్తులు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురంలో వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గెలిచారు. మొత్తం 45 శాతం ఓట్లు సాధించారు. అటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన 42 శాతం ఓట్లు రాబట్టారు. మరోవైపు జనసేన అభ్యర్థి పొలిశెట్టి చంద్రశేఖర్ కు 11 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులకు 2 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో శెట్టిబలిజ కమ్యూనిటీ సపోర్ట్ ఉండడం, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ వేవ్ ఉండడంతో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల కృష్ణ గెలిచారు. మరోవైపు కాపు కమ్యూనిటీ ఓట్లు టీడీపీ, జనసేన మధ్య చీలిపోవడం వారికి మైనస్ గా మారింది. మరి ఈసారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడంతో రామచంద్రాపురం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
Read More: Atmakur Assembly constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఆత్మకూరులో హవా ఎవరిది..?
పిల్లి సూర్యప్రకాశ్ ( YCP ) ప్లస్ పాయింట్స్
పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ వారసత్వం
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం
పబ్లిక్ మీటింగ్, ప్రచారాల్లో జోరు పెంచడం
సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం
గ్రామ గ్రామాన క్యాంపెయినింగ్ చేయడం
యూత్ లో సూర్యప్రకాశ్ కు మంచి ఇమేజ్
పిల్లి సూర్యప్రకాశ్ తీరుపై క్యాడర్ లో సంతృప్తి
పిల్లి సూర్యప్రకాశ్ మైనస్ పాయింట్స్
ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారన్న డౌట్లు
ప్రభుత్వ ఇండ్లు అందరికీ అందకపోవడంపై నిరాశ
పామర్రు, కజలూరు మండలాల్లో దారుణంగా రోడ్లు
రామచంద్రాపురంలో డ్రైనేజ్ పొంగి రోడ్లపైకి రావడం
అమ్మ ఒడి, విద్యాదీవెన నిధులు ఆలస్యంగా రిలీజ్ అవడం
రెడ్డి సుబ్రమణ్యం (TDP) ప్లస్ పాయింట్స్
సీనియర్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు
ప్రజలకు అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండడం
టీడీపీ క్యాడర్ నుంచి బలమైన మద్దతు
రెడ్డి సుబ్రమణ్యం మైనస్ పాయింట్స్
అధికార పార్టీని ఎంత వరకు ఎదుర్కొంటారన్న డౌట్లు
పొలిశెట్టి చంద్రశేఖర్ (JSP)ప్లస్ పాయింట్స్
జనసేన పార్టీలో క్రియాశీలంగా ఉండడం
సెగ్మెంట్ ప్రజలతో టచ్ లో ఉండడం
జనంలో చంద్రశేఖర్ కు మంచి ఇమేజ్
గత ఎన్నికల్లో 18 వేల ఓట్లు సాధించిన పొలిశెట్టి
కాపు సామాజికవర్గం బలమైన మద్దతు
పొలిశెట్టి చంద్రశేఖర్ మైనస్ పాయింట్స్
పొత్తుల్లో భాగంగా టిక్కెట్ దక్కుతుందా లేదా అన్న డౌట్లు
ఇక వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..
పిల్లి సూర్యప్రకాశ్ VS రెడ్డి సుబ్రమణ్యం
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రామచంద్రాపురంలో వైసీపీ, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ షేర్ మాత్రమే గ్యాప్ కనిపిస్తోంది. వైసీపీకి కాస్త ఎడ్జ్ ఉన్నా.. ఎన్నికల నాటికి తటస్థ ఓటర్ల మైండ్ సెట్ ప్రకారమే గెలుపోటములు డిసైడ్ కానున్నాయి. వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాశ్ పోటీ చేస్తే 47 శాతం ఓట్లు, టీడీపీ నుంచి రెడ్డి సుబ్రమణ్యం బరిలో దిగితే 46 శాతం ఓట్లు, ఇక ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాశ్ కు స్ట్రాంగ్ క్యాడర్ సపోర్ట్, తండ్రి వారసత్వం, ప్రజలతో మమేకం అవడం, అలాగే జగన్ ప్రభుత్వ పథకాలపై జనంలో సంతృప్తి ఉండడం కలిసి వచ్చేలా కనిపిస్తోంది. టీడీపీకి వచ్చే ఓట్ షేర్ కు కారణం టీడీపీ, జనసేన కలిసి బరిలో దిగుతుండడం. ఈ రెండు పార్టీల ఓట్ల బదిలీ పకడ్బందీగా జరిగితే ఎన్నికల నాటికి గెలుపు అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది.