BigTV English

BIG TV Exclusive : అందుకు పెళ్లే కావాలా? మా ప్రేమ కథతో సినిమా తీస్తున్నాం: ‘బిగ్ టీవీ’ ఇంటర్వ్యూలో దువ్వాడ, మాధురి

BIG TV Exclusive : అందుకు పెళ్లే కావాలా? మా ప్రేమ కథతో సినిమా తీస్తున్నాం: ‘బిగ్ టీవీ’ ఇంటర్వ్యూలో దువ్వాడ, మాధురి

BIG TV Exclusive : దువ్వాడ శ్రీనివాసరావు, మాధురీల జంట ఈ మధ్య ఏపీలో బాగా ఫేమస్. ఎక్కడ చూసినా వీరు జంట గురించే వినిపిస్తోంది, కనిపిస్తోంది. త్వరలోనే వీరి ప్రేమ కథ ఓ సినిమా రూపంలో రాబోతుందంట. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది అంటున్నారు దువ్వాడ శ్రీనివాసరావు, మాధురీలు. ఈ విషయాన్ని ఈ జోడినే స్వయంగా వెల్లడించారు. బిగ్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇలాంటి ఆసక్తికర విషయాలను ఎన్నింటినో పంచుకుంది.. ఈ జంట. మరి అవేంటంటే…


దువ్వాడ శ్రీనివాసరావు, మాధురీలు… తాము స్నేహితులమే అని, తమ బంధాన్ని తన భార్య వాణి చెడుగా, తప్పుగా ప్రచారం చేసిందని శ్రీనివాసరావు తెలిపారు. ఆ కారణంగానే తన జీవితం, మాధురీ కుటుంబం ఇబ్బందులు పడిందని.. అందుకే ఆ ప్రచారాన్నే నిజం చేయాలని తామిద్దరం నిర్ణయించుకున్నాం అని తెలిపారు. కోర్టులో తన భార్య వాణితో వివిధ కేసులు నడుస్తున్నాయి అని… వాటిని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని దువ్వాడ శ్రీనివాసరావు వెల్లడించారు. తనకు ముగ్గురు పిల్లలని, మాధురీకి ఇద్దరు పిల్లలని.. మొత్తం ఐదుగురు బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ జోడి తెలిపింది. 

ఇక.. రౌడీ దువ్వాడ అంటేనే తనకి ఇష్టం అంటూ మనసులో మాట బయటపెట్టేసింది మాధురి. శ్రీనులో ఉండే నిక్కచ్చి తనం, నిబద్ధత, ధైర్యం చూసి తాను పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను అంటూ మురిసిపోయింది. చట్టబద్ధంగానే తామిద్దరికి ఇంకా పెళ్లి కాలేదని.. మానసికంగా తాము ఎప్పుడో కలిసిపోయాం అంటోంది మాధురీ. ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా… తామిద్దరం భార్యాభర్తలమని తెగేసి చెప్పేసింది. కోర్టులో కేసులు ముగిసిన తర్వాత తామిద్దరం చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటామంటూ తెలిపింది. 


అంతేకాదు దువ్వాడ శ్రీనివాసరావు లాంటి లెజెండ్ వారసత్వాన్ని కొనసాగించాలని తనకు ఉందన్న మాధురి.. శ్రీనివాస్ తో కలిసి పిల్లల కనాలని ఉందని చెప్పేసింది. శ్రీనుకి ఇద్దరు ఆడపిల్లలేనని.. ఆయన వారసత్వం ఉండాలంటే మగపిల్లాడి కావాలని.. అందుకే పిల్లల్ని ప్లాన్ చేస్తున్నామంటూ హింట్ ఇచ్చేసింది ఈ ట్రెండింగ్ జోడి. 

అలానే.. తమ కుటుంబం, అందులోని ఈర్ష్యా, ద్వేషాలతో పాటు స్వార్థం వంటి అంశాలను తీసుకుని.. తన పాత జీవితం, దివ్వెల మాధురీ పరిచయం, ప్రేమ వరకు ఓ కొత్త సినిమా తీయనున్నట్లు దువ్వాడ జోడి ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్ట్కిప్ట్ వర్క్ పూర్తయ్యిందని.. త్వరలోనే సినిమాగా ప్రజలకు ముందుక తీసుకువస్తానంటూ ప్రకటించారు.. శ్రీనివాసరావు.

Also Read :  ఏపీలో మందుబాబుల‌కు గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన మ‌ద్యం ధ‌ర‌లు!

ప్రస్తుతం తన జీవితం సంతోషంగా ఉందన్న శ్రీనివాస రావు.. రానున్న రోజుల్లో మరింత ఆనందంగా గడుపుతామని తెలిపారు. మాధూరీతో జీవితాన్ని ఆస్వాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. చాన్నాళ్లుగా తన జీవితంలో సంతోషం తప్పిపోయిందని.. అవ్వన్నీ మాధురీ కారణంగా తిరిగి వచ్చాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాలు, కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొంటూ వచ్చిన తనకు.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటూ తెలిపారు. మొత్తానికి ఈ జంట రోజూ కొత్త ముచ్చట్లతో నెటిజన్లకు, ప్రజలను అలరిస్తూనే ఉన్నారు.

 

Related News

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

Big Stories

×