Samantha: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది సమంత(Samantha). మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకొని, మంచి పాపులారిటీ అందుకుంది. ఇక తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉండగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అందరికీ తెలియజేసింది. అయితే ఇప్పుడు తన తండ్రి మరణం తర్వాత.. సమంత గతంలో తన తండ్రి గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఇండియన్ పేరెంట్స్ లాంటివారే..
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. “మా నాన్న కూడా చాలామంది ఇండియన్ పేరెంట్స్ లాంటివారే. ఆయన నాతో ఎప్పుడూ కూడా నువ్వు అంత తెలివైన దానివేం కాదు.. అందుకే నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించగలవు.. అని అనేవారు. ముఖ్యంగా నా జీవితంపై మా నాన్న మాటల ప్రభావం ఎంతో వుంది” అంటూ ఆ ఇంటర్వ్యూలో సమంత తెలిపింది. మొత్తానికైతే గతంలో సమంతపై జోసెఫ్ ప్రభు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
సమంత వ్యక్తిగత జీవితం..
‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సమంత. అయితే ఇందులో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట, 2017లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఎంతో సంతోషంగా, క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరు ‘మజిలీ’ సినిమా చేసి జంటగా విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సమంత బాలీవుడ్ లో ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ చేసిన తర్వాత అనూహ్యంగా ఇద్దరూ 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. దీంతో ఈ వెబ్ సిరీస్ లో భిన్నంగా నటించడం వల్లే సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చారు అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి.
అనారోగ్య సమస్యలు..
విడాకుల తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత, ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన పడింది. ఈ సమస్య నుంచి బయటపడలేక విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఈ సమస్య నుంచి బయటపడుతూ మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది.
సమంత సినిమాలు..
ఇటీవల హిందీలో ‘సిటాడెల్ హనీబన్నీ’ అనే వెబ్ సిరీస్ చేసిన ఈమె ఈ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని దక్కించుకొని, ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది సమంత. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.