BigTV English

Mylavaram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే..! మైలవరం ఓటర్ల తీర్పు ఇదేనా..?

Mylavaram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే..! మైలవరం ఓటర్ల తీర్పు ఇదేనా..?
Mylavaram Assembly Constituency

Mylavaram Assembly Constituency : మైలవరం.. విజయవాడ పక్కనే ఉన్న కీలక నియోజకవర్గం. పాలిటిక్స్ కూడా బెజవాడ రాజకీయాల్లానే హాట్ హాట్ గా ఉంటాయి. ఈసారి మరింత హాట్ గా ఉండేలా కనిపిస్తున్నాయి. 2019లో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి కుమారుడు నువ్వానేనా అన్నట్టుగా పోటీపడ్డారు. అయితే అప్పుడు మాత్రం కేవలం జగన్ హవాతో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌నే విజయం వరించింది. వీరిద్దరిదీ ఒకే సామాజికవర్గం. ధనబలంలోనూ, అంగబలంలోనూ ఒకరికొకరు తీసిపోరు. అందుకే మైలవరంలో 2019లో హోరాహోరి యుద్ధం సాగింది. మరి ఈ సారి ఎన్నికల్లో అదే పరిస్థితి రిపీట్ అవుతుందా..? దేవినేని ఉమ మళ్లీ బలం పెంచుకుని విజయఢంకా మోగిస్తారా? మైలవరం ఓటర్ల మనోగతం ఏంటి? బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటి??


2019 RESULTS : వసంత కృష్ణప్రసాద్ vs దేవినేని ఉమామహేశ్వరరావు

PIE CHART
YCP 50%
TDP 45%
OTHERS 3%
NOTA 2%


కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్‌ 2019లో 12 వేల 653 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు దాదాపు 50 శాతం ఓట్లు లభించగా.. దేవినేని ఉమాకు దాదాపు 45 శాతం ఓట్లు పడ్డాయి. ఈ సారి కూడా వీరిద్దరే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో మైలవరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

వసంత కృష్ణ ప్రసాద్‌ (YCP)

వసంతకృష్ణ ప్రసాద్‌ ప్లస్ పాయింట్స్

  • నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం
  • సంక్షేమ పథకాల అమలు

వసంతకృష్ణ ప్రసాద్‌ మైనస్ పాయింట్స్

  • అన్ని సామాజిక వర్గ ప్రజలకు ఒకేలా చూడకపోవడం
  • గుర్తించేంతగా కనిపించని నియోజకవర్గ అభివృద్ధి
  • క్యాడర్‌లో ఆయనపై అంత మంచి అభిప్రాయం లేకపోవడం
  • పార్టీ అధినాయకత్వం కూడా పక్కన పెట్టడం
  • రాజకీయాలపై తరచూ నిర్వేదంగా మాట్లాడుతుండడం

దేవినేని ఉమామహేశ్వరరావు (TDP)

దేవినేని ఉమా ప్లస్ పాయింట్స్

  • టీడీపీ సంప్రదాయ ఓటర్ల బలమైన మద్దతు
  • నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉండటం
  • ప్రభుత్వ తప్పులపై అలుపెరగని పోరాటం
  • టీడీపీలో ముఖ్య నేతల్లో ఒకరిగా ఉండటం

కులాల వారీగా
ఎస్సీ 25%
కమ్మ 15%
కాపు 12%
యాదవ్ 10%
గౌడ్ 6%
ఎస్టీ 6%
రెడ్డి 4%

మైలవర్గంలో అత్యధికంగా ఎస్సీ సామాజిక ఓటర్లు ఉన్నారు. పోటీ చేసే అభ్యర్థులు, పార్టీల వారీగా వివిధ సామాజికవర్గాల అభిప్రాయం ఎలా ఉంది? బిగ్‌ టీవీ సర్వేలో వాళ్లు చెప్పిన ఒపీనియన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు 25 శాతం ఉండగా వీరిలో వైసీపీకి 55 శాతం, టీడీపీకి 40 శాతం, ఇతర పార్టీలకు 5 శాతం సపోర్ట్ గా ఉంటామంటున్నారు. ఇక కమ్మ కమ్యూనిటీ ఓటర్లు 15 శాతం ఉండగా… వైసీపీకి 35 శాతం అనుకూలంగా ఉండగా.. మెజారిటీ అంటే 60 శాతం మంది టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక కాపు సామాజిక ఓటర్లు 12 శాతం ఉండగా.. వైసీపీకి 40 శాతం మద్దతిస్తుండగా.. టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 55 శాతం సపోర్ట్ చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గ ఓటర్లు 10 శాతం ఉండగా.. వీరిలో 40 శాతం మంది వైసీపీకి మద్దతిస్తుండగా.. అత్యధికంగా 55 శాతం మంది టీడీపీకి తమ ఓటు వేస్తామంటున్నారు. ఇక గౌడ్‌ సామాజిక వర్గ ఓటర్లు 6 శాతం ఉండగా.. వైసీపీకి 55 శాతం, టీడీపీకి 40 శాతం ఇస్తామంటున్నారు. ఎస్టీ ఓటర్లు 6 శాతం ఉండగా వీరిలో మెజారిటీ అంటే 60 శాతం మంది వైసీపీకి, టీడీపీకి 35 శాతం మద్దతిస్తామంటున్నారు. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 4 శాతం ఓటర్లు ఉండగా వైసీపీకి అత్యధికంగా 60 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. టీడీపీకి 35 శాతం, ఇతరులకు 5 శాతం సపోర్ట్ ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయాలు చెప్పారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

దేవినేని ఉమామహేశ్వరరావు vs వసంత కృష్ణ ప్రసాద్‌

TDP 51%
YCP 44%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మైలవరంలో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు 51 శాతం ఓట్లతో ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు 44 శాతం ఓట్లకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంది. దేవినేని ఉమను కాదని వసంతను గత ఎన్నికల్లో గెలిపించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ప్రభావం చూపించలేకపోయారన్న అభిప్రాయం ఓటర్లలో కనిపిస్తోంది. అందుకే తిరిగి దేవినేని ఉమకే మైలవరం ఓటర్లు జై కొట్టేందుకు సిద్ధపడినట్లుగా బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×