Chahal-Dhanashree : భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ (Dhanashree Verma) చేసిన కామెంట్స్ ప్రస్తుతం పెను సంచలనంగా మారాయి. పెళ్లి జరిగిన రెండు నెలలకే వీరి మధ్య విడాకులకు దారితీసిందనే విషయాన్ని ఆమె వెల్లడించింది. దీంతో ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. “రైజ్ అండ్ ఫాల్” (Rise of Fall) అనే రియాల్టి షోలో ఆమె తన హౌస్ మేట్స్ తో ఈ విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా ఆమె సహ పోటీదారుడు కుబ్రా సైత్.. “మీరు చాహల్ తో బంధం ఇక పని చేయదు” అని ఎప్పుడు గ్రహించారు..? అని ప్రశ్నించాడు. దీనికి ధనశ్రీ వర్మ సమాధానం చెబుతూ.. “వాస్తవానికి నేను చాహల్ ను పెళ్లి అయిన రెండో నెలలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను” అని షాకింగ్ సమాధాణం చెప్పింది. ఇక ఈ మాట వినగానే కుబ్రా సైత్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Abhishek Sharma Car : ఒకే కారులో గిల్, అభిషేక్…దుబాయ్ వీధుల్లోనే ఎంజాయ్
క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ డిసెంబర్ 22, 2020 న పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్ల పాటు సాఫీగానే సాగిన వీరి వైవాహిక జీవితం.. 2022లో వీరి మధ్య మనస్పార్థాలు తలెత్తాయి. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇద్దరం కలిసి ఉండలేమని నిర్ణయించుకొని మార్చి 20, 2025 న వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వారి విడాకుల గురించి వచ్చిన భరణం ఆరోపణలపై స్పందించింది ధనశ్రీ వర్మ… “అధికారికంగా ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. కానీ ఇది పరస్పర అంగీకారంతో జరిగింది. అందుకే భరణం గురించి ప్రజలు మాట్లాడటం చాలా తప్పు. నేను ఏమి చెప్పడం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా”..? అని ప్రశ్నించింది.
Also Read : Suryakumar Yadav : మోడీ వల్లే ఇది సాధ్యం… ఇండియన్ ఆర్మీకి భారీ సాయం ప్రకటించిన సూర్య
తన తల్లిదండ్రులు తనకు ఏమి నేర్పారంటే..? కేవలం తనను పట్టించుకునే వారికి మాత్రమే వివరణ ఇవ్వాలని.. మిగతా వారికి టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో కూడా ధనశ్రీ వర్మ తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు. “నేను ఒక విషయాన్ని బయటపెడితే.. ఈ షో కూడా మీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది” అని పరోక్షంగా చాహల్ పై ఆరోపణలు చేసింది. ఈ మొత్తం వివాదం పై యజ్వేంద్ర చాహల్ ఇంకా నేరుగా స్పందించలేదు. తాజాగా ధన శ్రీ చేసిన ప్రకటన మాజీ దంపతుల మధ్య మరో చర్చకు దారి తీయడం విశేషం. ఇక ఇటీవల కూడా పలుమార్లు చాహల్ పై ధనశ్రీ వర్మ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==