BigTV English

Atmakur Assembly constituency Survey: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఆత్మకూరులో హవా ఎవరిది?

Atmakur Assembly constituency Survey: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఆత్మకూరులో హవా ఎవరిది?
Political news in AP

Atmakur Assembly Constituency Survey: ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటి. సోమశిల డ్యాం ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడి రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఉంది. సెగ్మెంట్‌లో ఈ కుటుంబానికి మంచి పేరు ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా పని చేశారు. అయితే 2022లో గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన బైపోల్‌లో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి ఆత్మకూరులో పట్టు నిలుపుకున్నారు. మరి ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

మేకపాటి గౌతమ్ రెడ్డి VS బొల్లినేని కృష్ణయ్య


2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 53 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్యకు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులకు 7 శాతం ఓట్లు దక్కాయి. గత ఎన్నికల్లో విపక్ష సభ్యుడిగా ఉండిపోవడం వల్ల ఆత్మకూరు అభివృద్ధి చేయలేకపోయానని 2019లో గౌతమ్ రెడ్డి ప్రచారం చేయడం, ఆ సింపథీ కలిసి వచ్చి గెలిచారు. అయితే ఆయన హఠాన్మరణంతో 2022లో ఆత్మకూరులో ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయడం భారీ మెజార్టీతో గెలవడం జరిగిపోయాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఆత్మకూరు సెగ్మెంట్‌లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Read More: Mandapeta Assembly constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. మండపేటలో టీడీపీ హవా కొనసాగేనా?

మేకపాటి విక్రమ్ రెడ్డి ( YCP ) ప్లస్ పాయింట్స్

  • జనంలో మేకపాటి కుటుంబానికి ఉన్న పాజిటివ్ ఇమేజ్
  • వైసీపీ సర్కార్ స్కీంలపై ఆత్మకూరు జనంలో సంతృప్తి
  • మేకపాటి విక్రమ్ రెడ్డికి బలమైన వైసీపీ క్యాడర్ సపోర్ట్
  • సెగ్మెంట్ అంతటా విస్తృత ప్రచారాలు
  • ఆత్మకూరు సెగ్మెంట్‌లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగవడం
  • వాలంటీర్ వ్యవస్థపై జనంలో పాజిటివ్ ఒపీనియన్ ఉండడం

మేకపాటి విక్రమ్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • ఆత్మకూరు టు సోమశిల డ్యాం మధ్య రోడ్డు డ్యామేజ్
  • కొమ్మవారిపల్లి టు కనిగిరి రోడ్డు కూడా డ్యామేజ్ అవడం
  • ఏఎస్ పేట, చేజర్ల, మర్రిపాడు మండలాల్లో రోడ్ల రిపేర్ పెండింగ్
  • మర్రిపాడు, ఏఎస్ పేట మండలాల్లో తాగునీటి సమస్య
  • కొందరికే టిడ్కో ఇండ్లు అందడం
  • ఉపాధి, ఉద్యోగ కల్పన కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు

కొమ్మి లక్ష్మయ్య నాయుడు ( TDP ) ప్లస్ పాయింట్స్

  • టీడీపీలో యాక్టివ్ గా ప్రచారాలు
  • జనానికి అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం

కొమ్మి లక్ష్మయ్య నాయుడు మైనస్ పాయింట్స్

  • పార్టీలు మారడంతో నెగెటివ్ ఇంపాక్ట్
  • బలమైన సొంత క్యాడర్ లేకపోవడం

గూటూరు మురళీ కన్నబాబు ( TDP ) మైనస్ పాయింట్స్

  • 2014లో ఓటమి తర్వాత క్యాడర్ కు దూరం
  • ఆత్మకూరులో టీడీపీ క్యాడర్ అసంతృప్తి
  • సమస్యలపై ఫాస్ట్ గా ప్రతిస్పందించరన్న అభిప్రాయం
  • గ్రౌండ్ లో యాక్టివ్ గా లేకపోవడంతో టిక్కెట్ దక్కడంపై డౌట్లు

బొల్లినేని కృష్ణయ్య ( TDP ) ప్లస్ పాయింట్స్

  • బొల్లినేని కృష్ణయ్య సీనియర్ టీడీపీ నేతగా గుర్తింపు
  • ఆత్మకూరు జనంలో పాజిటివ్ ఇమేజ్
  • గత ఎన్నికల్లో ఓడినా ఆత్మకూరులో యాక్టివ్ గా ఉండడం
  • ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం

బొల్లినేని కృష్ణయ్య మైనస్ పాయింట్స్

  • టిక్కెట్ రేసులో చాలా మంది ఉండడం
  • టీడీపీ క్యాడర్ ఐక్యంగా లేకపోవడం
  • ఎన్నికల ముందే హడావుడి చేయడం మైనస్

ఆనం కైవల్య రెడ్డి ( TDP ) ప్లస్ పాయింట్స్

  • ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తెగా గుర్తింపు

ఆనం కైవల్య రెడ్డి మైనస్ పాయింట్స్

  • గ్రౌండ్ లో యాక్టివ్ గా లేకపోవడం

నల్లిశెట్టి శ్రీధర్ ( JSP ) ప్లస్ పాయింట్స్

  • టీడీపీతో పొత్తులో టిక్కెట్ దక్కితే ఎఫెక్ట్ చూపించే ఛాన్స్
  • కమ్మ, కాపు ఓటు బ్యాంకుపై ఆశలు

ఇక వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

మేకపాటి విక్రమ్ రెడ్డి VS బొల్లినేని కృష్ణయ్య

ఇప్పటికిప్పుడు ఆత్మకూరులో ఎన్నికలు జరిగితే వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగే మేకపాటి విక్రమ్ రెడ్డికి 51 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య బరిలో దిగితే 43 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వైసీపీకి ఎక్కువ ఓట్ షేర్ రావడానికి కారణం… ఆత్మకూరు సెగ్మెంట్ లో మేకపాటి కుటుంబానికి ఉన్న ఇన్ ఫ్లూయెన్స్. అదే సమయంలో మంత్రిగా పని చేస్తూ గుండెపోటుతో మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడం కూడా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల్లో సింపథీని బాగా పెంచేశాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉండడం, జనంలో ఇన్ ఫ్లూయెన్స్ పెరిగేలా చేశాయి. అదే సమయంలో వైసీపీ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు ఉండడం, అపోజిషన్ అభ్యర్థులు బలహీనంగా కనిపించడం, బలమైన క్యాడర్ సపోర్ట్ ఉండడం, టీడీపీలో టిక్కెట్ కోసం చాలా మంది నేతల మధ్య పోటీ ఉండడం, కోల్డ్ వార్ ఇవన్నీ వైసీపీ ఓటు బ్యాంకు పెరగడానికి కారణంగా తేలింది.

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×