E-Paper
Advertisement

Amaravati: 18న అమరావతికి బిల్‌గేట్స్ రాక.. 19న ఏఐ యూనివర్సిటీ ఓపెన్, ఆ తర్వాత గూగుల్ వంతు

Amaravati: 18న అమరావతికి బిల్‌గేట్స్ రాక.. 19న ఏఐ యూనివర్సిటీ ఓపెన్, ఆ తర్వాత గూగుల్ వంతు
Advertisement

Amaravati: ఏపీ రాజధానికి అమరావతికి టెక్ దిగ్గజాల రాక క్రమంగా మొదలుకానుంది. గడిచిన రెండేళ్లు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన చంద్రబాబు,  రాజధానికి ప్రపంచంలోని టెక్ దిగ్గజాలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరి 18న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమరావతికి రానున్నారు. ఆ మరుసటి రోజు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఓపెన్ కానుంది. రెండురోజుల గ్యాప్‌లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌కి పునాది రాయి పడనుంది.

ఏపీ రాజధాని అమరావతికి టెక్ దిగ్గజాల రాక

Advertisement

ఏపీ రాజధాని అమరావతికి ఈనెల 18న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్యలో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది.

గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం- బిల్-మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం జరిగింది. అందులో భాగంగా హెల్త్‌కేర్ అనలిటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్, గవర్నెన్స్‌లో టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగంగా సేవలను అందించడానికి ఎంఓయూపై సంతకం చేశారు.

Advertisement

18న అమరావతికి బిల్‌గేట్స్.. 19న ఏఐ యూనివర్సిటీ ఓపెన్

ఈ ప్రాజెక్టు అమలుపై ఇరువురు మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే అమరావతిలోని క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించే అవకాశం ఉంది. వీరి భేటీలో దీనిపై మరింత స్పష్టత రానుందని తెలుస్తోంది.

ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 19న అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఓపెన్ కానుంది. ఏఐ దిగ్గజ సంస్థ ఎన్విడియా సాయంతో ఇది ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ప్రకటించారు.

ఎన్విడియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్లలో 10 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో ఆ సంస్థ ట్రైనింగ్ ఇవ్వనుంది. ఎన్విడియా ఏఐ ల్యాబ్‌లు యూనివర్శిటీలో ఏర్పాటు చేయనున్నారు. రాష్టంలో టైర్-2, టైర్-3 నుండి వచ్చినవారికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ALSO READ:  ఏపీలో హింసా రాజకీయం.. ప్రజల సపోర్ట్ ఎవరికి? 

అమరావతిలో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్శిటీతోపాటు ఏఐపై పని చేస్తున్న స్టార్టప్స్ కు సాయం చేయబోతోందని తెలుస్తోంది. సాంకేతిక సాయం, మార్గదర్శకత్వం, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేయడానికి అవకాశాల్ని గుర్తించి వారికి అందించనుందట. తర్వాత దశల్లో దీన్ని మరింతగా విస్తరించాలని ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరోవైపు ఫిబ్రవరి 20 లేదా 22న విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు పునాది రాయ వేయనుంది. ఇటీవల దావోస్‌లో ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఆ తర్వాత గూగుల్‌కి భూములకు సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు కూడా. తొలుత ఫిబ్రవరి 15 లోపు గూగుల్ పునాది రాయి వేయాలని భావించినప్పటికీ అది కాస్త 20 తేదీకి మారినట్టు తెలుస్తోంది.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×